Home /News /movies /

BIGG BOSS TELUGU AFTER BIGG BOSS MONAL GAJJAR GETS GOOD OFFERS FROM TOLLYWOOD IT SEEMS HERE ARE THE DETAILS SR

Monal Gajjar : మోనాల్ గజ్జర్‌కు ఓ సినిమా ఛాన్స్‌తో పాటు మరో టీవీ షోలో హోస్ట్‌గా అవకాశం.. ఇదంతా ఆయన చలువేనట..

మోనాల్ గజ్జర్ (Monal Gajjar)

మోనాల్ గజ్జర్ (Monal Gajjar)

Bigg Boss Telugu 4-Monal Gajjar : మోనాల్ గజ్జర్.. ఓ నెల ముందు వరకు పెద్దగా తెలియని పేరు. అంతేందుకు అసలు ఈ పేరుతో ఓ హీరోయిన్ ఉందని కూడా చాలా మందికి తెలియదు.

    మోనాల్ గజ్జర్.. ఓ నెల ముందు వరకు పెద్దగా తెలియని పేరు. అంతేందుకు అసలు ఈ పేరుతో ఓ హీరోయిన్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ పుణ్యమా అని.. ఈ భామకు సూపర్ పబ్లిసిటీ వచ్చింది. ఎప్పుడైతే బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టిందో.. ఇక అప్పటినుండి టాస్కులకంటే కూడా తన అంద చందాలతోనే ఎక్కువగా అలరించింది. చెప్పాలంటే ఈ భామ బిగ్ బాస్‌లో చేసింది ఏమిలేదు.. ఏడ్వడం తప్ప. అయిన దానికి, కానీదానికి ఏడ్చి.. బాగానే పాపులర్ అయ్యింది. దీనికి తోడు ఇంటి సభ్యులతో వీలున్నప్పుడల్లా రొమాన్స్‌ చేయడం. మరోవైపు కంటెస్టెంట్ అఖిల్ కూడా.. మోనాల్.. మోనాల్ అంటూ ఆమె చుట్టూ తిరగడం.. ఇలా ఈ రొమాంటిక్ యాంగిల్, ఆమె గ్లామర్ కోషంట్ కూడా మోనాల్’కు కలిసి రావడం.. బిగ్ బాస్ కూడా కొంత తోడ్పాటు ఇవ్వడంతో ఇన్ని రోజులు హౌజ్‌లో నెగ్గకొచ్చింది అని అంటున్నారు షోను చూసిన ప్రేక్షకులు. ఇక ఎప్పటినుంచో ఆమె ఎప్పుడు ఎలిమినేట్ అవ్వుద్దో అని ఎదురు చూస్తున్న కొంత మంది బిగ్ బాస్ అభిమానుల కోరిక 14 వ వారం ఎలిమినేషన్‌‌తో తీరింది. మోనాల్.. షో మరో వారంలో ముగియనుందనగా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక అది అలా ఉంటే ఈ గుజరాతీ భామకు బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీ కారణంగా ఇప్పుడు బాగానే ఆఫర్స్ వస్తున్నాయట.



    మోనాల్‌కు ముఖ్యంగా టీవీల్లో ఆఫర్స్ విరివిగా వస్తున్నాయని టాక్. ఓ ప్రముఖ టీవీ యాజమాన్యం మోనాల్‌తో ఓ టాక్‌ షోను నిర్వహించాలనీ చూస్తోందట. మరోవైపు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయట. అంతేకాదు ఈ ఓ సినిమాకు సైన్ కూడా చేసిందని తెలుస్తోంది. దీంతో ఉబ్బితబ్బిబైపోతుందట మోనాల్.. దీనికంతటికి కారణం బిగ్ బాస్ కాబట్టి.. అతనికి ధన్యవాదాలు చెబుతూ.. ఎగిరిగంతేస్తోందట. ఇక ఆమె సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఎనిమిదేళ్ల క్రితం అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’ చిత్రంలో మోనాల్ గజ్జర్ తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ సినిమా తర్వాత ఆమె మరో రెండు సినిమాలు చేసింది, కానీ ఆ సినిమాలు ఆమె పెద్దగా విజయం సాధించలేకపోయాయి. ఆమె గత మూడు సంవత్సరాలుగా ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన మోనాల్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. మోనాల్ మాట్లాడుతూ.. తనకు రెండవ బిగ్ బాస్ సీజన్‌ లోనే కాల్ వచ్చిందని అప్పుడు ఏవో కారణాల వల్ల కుదరలేదని.. ఆ తర్వాత మూడో సీజన్‌కు కూడా కాల్ వచ్చిందని అపుడు అమెరికాలో ఉన్నానని తెలిపింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bigg Boss 4 Telugu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు