Home /News /movies /

BIGG BOSS TELUGU 5 WHO WILL BE ELIMINATED IN THE EIGHTH WEEK FROM THE BIG BOSS HOUSE HERE ARE THE DETAILS SR

Bigg Boss Telugu 5 : ఈరోజు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసింది...

Bigg Boss Telugu 5 Photo : Twitter

Bigg Boss Telugu 5 Photo : Twitter

Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఐదవ సీజన్‌ ఇటీవలే మొదలైన మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది.

    Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఆరుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఆరవ వారంలో శ్వేతా వర్మ, ఏడవ వారంలో ప్రియ ఎలిమినేట్ ఎలిమినేట్ అయ్యారు.  దీంతో ప్రస్తుతం ఇంట్లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

    హౌస్‌లో అప్పుడే ఏడు వారాలు గడిచిపోయాయి. ఇందులో భాగంగా ఆరుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠని పెంచేస్తోంది. నామినేషన్‌లో ఉన్న వారిలో లోబోకు అందరి కంటే తక్కువుగా ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఈరోజు ఎలిమినేషన్‌లో భాగంగా లోబో ఇంటి నుంచి బయటకు వస్తారని అంటున్నారు. అంతేకాదు మరికొందరైతే లోబో అల్రేడీ ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు.


    ఫస్ట్ వీక్ నుంచీ తనదైన స్టైల్లో గేమ్ ఆడిన లోబో ఈ మధ్య ఎక్కువగా రవి, విశ్వ మాటలకి బాగా ఇన్ఫులెన్స్ అవుతున్నాడని అంటున్నారు. తనకంటూ ప్రత్యేకమైన గేమ్ ని డిజైన్ చేసుకోవడంలో విఫలం అయ్యారని దీంతో ఈ వారం అతను ఎలిమినేట్ అవుతున్నాడని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.

    ఇక మరోవైపు బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదని అంటున్నారు కొందరు నెటిజన్స్. హౌజ్‌లో పెద్దగా వేడి లేదని.. అంతా చప్పగా నడుస్తోందని టాక్ నడుస్తోంది. టాస్క్‌లు కూడా లాస్ట్ సీజన్‌లో చేసినవే ఉన్నాయని.. అవే పునరావృతమవుతున్నాయని అంటున్నారు. ఇక ఇంత వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా లేదని.. ఇంకేప్పుడు.. అసలు ఉంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు.

    Unstoppable Promo| Balakrishna : అన్నగారు స్థాపించిన పార్టీ పగ్గాలు చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారు : మోహన్ బాబు..

    ఇక బిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌ విషయానికి వస్తే... నాగార్జున ఇంటి సభ్యలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా సన్ని ప్రవర్తన తీరును ఊటంకిస్తూ ఇంకోసారి అలా చేయోద్దని హెచ్చరించారు. దీంతో పాటు నాగార్జున ఇంటి సభ్యులతో వైకుంఠ‌పాళి గేమ్ ఆడించారు. ఆ గేమ్ తర్వాత మెడ‌లో మోత‌- స‌రిపోయే సామెత’ అనే మరో గేమ్ ఆడించారు. ఈ రోజు దీపావ‌ళి స్పెష‌ల్‌గా ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీంతో ఈ కార్య‌క్ర‌మంలో విజయ్ దేవరకొండ, శ్రియ‌, యాంకర్ సుమ‌, బిగ్‌బాస్ పాత కంటెస్టెంట్లు స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు బిగ్ బాస్ వేదికపై సంద‌డి చేయ‌నున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bigg Boss 5 Telugu, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు