Home /News /movies /

Bigg Boss Telugu 5 : చప్పగా బిగ్‌బాస్ షో.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసింది...

Bigg Boss Telugu 5 : చప్పగా బిగ్‌బాస్ షో.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసింది...

Bigg Boss Telugu 5 Photo : Twitter

Bigg Boss Telugu 5 Photo : Twitter

Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఐదవ సీజన్‌ ఇటీవలే మొదలైన మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది.

    Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఐదవ సీజన్‌ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఐదుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఇంట్లో 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

    అయితే ఈసారి బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదని అంటున్నారు నెటిజన్స్. హౌజ్‌లో పెద్దగా వేడి లేదని.. అంతా చప్పగా నడుస్తోందని టాక్ నడుస్తోంది. టాస్క్‌లు కూడా లాస్ట్ సీజన్‌లో చేసినవే ఉన్నాయని.. అవే పునరావృతమవుతున్నాయని అంటున్నారు. ఇక ఇంత వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా లేదని.. ఇంకేప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    Pooja Hegde: గ్రాండ్‌గా పూజా హెగ్డే బర్త్ డే సంబరాలు.. పిక్స్ వైరల్...

    ఇక ఇప్పటికే శనివారం రాగా మరో రోజులో ఇంటి నుంచి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వనున్నారు. దీంతో ఇప్పటికే ఆరో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ వారం లోబో ఎలిమినేట్ అయ్యే అవకాశం మెండుగా ఉందని తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే శుక్రవారం బిగ్ బాస్ 41వ ఎపిసోడ్ ఆస‌క్తిక‌రంగా సాగింది. కెప్టెన్‌గా విశ్వ‌ హౌజ్‌లో హల్ చల్ చేస్తున్నారు. అంతేకాదు ప్రియాంక‌కు దారుణ‌మైన శిక్ష విధించారు.

    Manchu Vishnu: నేడు 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం.. ముఖ్య అతిథి ఎవరో తెలుసా?

    రెండు సార్లు మైక్ మ‌ర‌చిపోయిన క్రమంలో మానస్‌తో లైట్స్ ఆఫ్ అయ్యే వరకూ మాట్లాడొద్దని కండీషన్ పెట్టారు విశ్వ. అంతేకాదు ఓన్లీ సైగలు మాత్రమే చెయ్యాలి అని అన్నారు. ‘ప్లీజ్ అన్నయ్య.. నా వీక్ నెస్ మీద కొట్టొద్దు.. నా వల్ల కాదు’ అంటూ ప్రియాంక చాలాసేపు బ్రతిమిలాడినా కూడా విశ్వ ఒప్పుకోలేదు. ఇక మరోవైపు కుక్క‌ర్‌పై రైస్ ఉడుకుతున్న స‌మ‌యంలో అది ప‌క్క‌న పెట్టి బ్లాక్ కాఫీ పెట్టుకుందన్న విషయంలో శ్వేత‌కు ప్రియ‌కు వాగ్వాదం జరిగింది. ఈ విషయంపైనే ఎక్కువ సేపు డిస్కషన్ జరిగింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bigg Boss 5 Telugu, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు