BIGG BOSS TELUGU 5 WHO WILL BE ELIMINATED IN SEVENTH WEEK FROM THE BIG BOSS HOUSE HERE ARE THE DETAILS SR
Bigg Boss Telugu 5 : డేంజర్ జోన్లో ఇద్దరు.. ఈ వారం బిగ్‌బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...
Bigg Boss Telugu 5 Photo : Twitter
Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఐదవ సీజన్ ఇటీవలే మొదలైన మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది.
Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్ విజయవంతంగా నడుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఆరుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఆరవ వారంలో శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఇంట్లో 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.
హౌస్‌లో అప్పుడే ఆరువారాలు గడిచిపోయాయి. ఇందులో భాగంగా ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠని పెంచేస్తోంది. నామినేషన్లో ఉన్న వారిలో ముఖ్యంగా అనీమాస్టర్, లోబో, సిరి డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే తెలుస్తోన్న సమాాచారం మేరకు లోబోనే ఈవారం ఎలిమినేట్ అవుతాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ నుంచీ తనదైన స్టైల్లో గేమ్ ఆడిన లోబో ఈ మధ్య ఎక్కువగా రవి, విశ్వ మాటలకి బాగా ఇన్ఫులెన్స్ అవుతున్నాడని అంటున్నారు. తనకంటూ ప్రత్యేకమైన గేమ్ ని డిజైన్ చేసుకోవడంలో విఫలం అయ్యారని దీంతో ఈ వారం అతను ఎలిమినేట్ అవ్వోచ్చని అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే అనీ మాస్టర్ కూడా లోబోతో సమానంగా డేంజర్ జోన్లో ఉన్నట్లు టాక్.
అయితే ఈసారి బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదని అంటున్నారు కొందరు నెటిజన్స్. హౌజ్‌లో పెద్దగా వేడి లేదని.. అంతా చప్పగా నడుస్తోందని టాక్ నడుస్తోంది. టాస్క్‌లు కూడా లాస్ట్ సీజన్లో చేసినవే ఉన్నాయని.. అవే పునరావృతమవుతున్నాయని అంటున్నారు. ఇక ఇంత వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా లేదని.. ఇంకేప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ విషయానికి వస్తే... హౌజ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జట్టుగా ఉన్న సిరి, షణ్ముఖ్, జస్వంత్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇప్పటి వరకు సీక్రెట్ రూమ్‌లో ఉండి గేమ్‌ని పరిశీలించిన లోబో తిరిగి హౌజ్‌లోకి వచ్చేశారు.
మరోవైపు సీక్రెట్ టాస్కును సరిగ్గా అర్థం చేసుకోలేని జెస్సీ కెప్టెన్సీ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఎక్కువగా గుడ్లు సంపాదించి మానస్, విశ్వ, సన్నీ, శ్రీరామచంద్ర, యాంకర్ రవిలు కెప్టెన్సీ పోటీలోకి వచ్చారు. అయితే లోబో తన దగ్గర ఉన్న ఎగ్స్ సాయంతో శ్రీరామ చంద్రను కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించి.. గోల్డెన్ ఎగ్ సాయంతో కాజల్‌ను పోటీలో ఉంచారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.