Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఐదవ సీజన్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు నలుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం లోబో బయటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. టాక్ వచ్చింది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు హమీదా ఎలిమినేట్ అవుతుందని సమాచారం. హమీదాకు అందరికంటే తక్కువుగా ఓట్లు వచ్చాయట. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..
ఇక అది అలా ఉంటే ఈ వారం కొండపొలం టీమ్ బిగ్ బాస్ టీమ్‌తో ముచ్చటించనున్నారు. దీనికి సంబంధించిన ఓప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమా అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. హీరో వైష్ణవ్ తేజ్, దర్శకుడు క్రిష్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ వేదికపై నాగార్జునతో కలిసి అలరించనున్నారు. వైష్ణవ్ ఇంత చిన్న వయస్సులోనే రకుల్‌ని ప్రేమించావా అంటూ నాగార్జున అడగ్గా.., వైష్ణవ్ చేయాల్సి వచ్చిందని బదులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Weekend fun starts with #Kondapolam team visit and housemates ki encounters!#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun @dirkrish pic.twitter.com/Hhve2eqdJa
— starmaa (@StarMaa) October 9, 2021
ఇక కొండ పొలం సినిమా విషయానికి వస్తే.. అడవి నేపథ్యంలో పూర్తి అడ్వెంచర్స్ చిత్రంగా రూపొందింది. ఇందులో రకుల్ పూర్తి గ్రామీణ యువతిగా, గొర్రెలు కాచుకొనే ‘ఓబులమ్మ’గా నటించగా.. వైష్ణవ్ తేజ్ ‘కటారు రవీంద్ర యాదవ్’ అనే పాత్రలో కనిపించి అలరించారు.
MAA Elections : మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్.. రాత్రి 8 గంటలకు ఫలితాలు...
ఇక కొండపొలం కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 5 Telugu, Kondapolam, Nagarjuna, Tollywood news