Home /News /movies /

BIGG BOSS TELUGU 5 WHAT IS THE REMUNERATION FOR SWETHA VARMA FOR ONE WEEK HERE ARE THE DETAILS SR

Bigg Boss Telugu 5 : ఆదివారం బిగ్‌బాస్ ఇంటి నుంచి ఎలిమినేటైనా శ్వేత వర్మకు ఎంత ముట్టింది..

Swetha Varma Photo : Twitter

Swetha Varma Photo : Twitter

Bigg Boss Telugu 5 : శ్వేత వర్మ ది రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు, పచ్చీస్, సైకిల్ చిన్న పెద్దా సినిమాల్లో వెబ్ సిరీస్‌ల్లో నటించారు. అయితే ఆమెకు మాత్రం రావాల్సిన గుర్తింపు రాలేదు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టిన శ్వేతా బాగానే ఆకట్టుకుంది.

ఇంకా చదవండి ...
    Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఐదవ సీజన్‌ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఐదుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆరవ వారంలో శ్వేతా వర్మ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఇంట్లో 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

    ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన శ్వేత వర్మ విషయానికి వస్తే.. ఆమె ది రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు, పచ్చీస్, సైకిల్ చిన్న పెద్దా సినిమాల్లో వెబ్ సిరీస్‌ల్లో నటించారు. అయితే ఆమెకు మాత్రం రావాల్సిన గుర్తింపు రాలేదు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టిన శ్వేతా బాగానే ఆకట్టుకుంది. మంచి ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంది. హౌజ్‌లో వివిధ టాస్కులలో గట్టి పోటినిస్తూ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అనుహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. మరో కంటెస్టెంట్ లోబో ప్రస్తుతం సీక్రెట్ రూమ్‌లో ఉంటూ అందరిని గమనిస్తున్నారు.


    ఇక తాజాగా ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన శ్వేత రెమ్యూనరేషన్‌పై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆరువారాలు ఇంట్లో ఉంటూ వారానికి 60-80 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట శ్వేతా వర్మ. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా శ్వేతా వర్మకు బిగ్ బాస్ హౌజ్ కావాల్సినంత ఫేమ్‌ను పాపులారిటీని ఇచ్చిందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

    Shyam Singha Roy : క్రిస్మస్ కానుకగా నాని శ్యామ్ సింగ రాయ్.. అధికారిక ప్రకటన..

    ఇక మరోవైపు బిగ్ బాస్ ప్రేక్షకులు షోపై కొంత అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదని అంటున్నారు నెటిజన్స్. హౌజ్‌లో పెద్దగా వేడి లేదని.. అంతా చప్పగా నడుస్తోందని టాక్ నడుస్తోంది. టాస్క్‌లు కూడా లాస్ట్ సీజన్‌లో చేసినవే ఉన్నాయని.. అవే పునరావృతమవుతున్నాయని అంటున్నారు. ఇక ఇంత వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా లేదని.. ఇంకేప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bigg Boss 5 Telugu, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు