Home /News /movies /

BIGG BOSS TELUGU 5 WHAT IS THE REASON FOR VISHWA ELIMINATION FROM THE HOUSE AND REMUNERATION HERE ARE THE DETAILS SR

Bigg Boss Telugu 5 : ఆ ఇద్దరి కారణంగానే విశ్వ బలి అయ్యారా.. ఎంత ముట్టింది...

Vishwa Bigg Boss Telugu 5 Photo : Twitter

Vishwa Bigg Boss Telugu 5 Photo : Twitter

Bigg Boss Telugu 5 : ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మంది ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా విశ్వ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఎంతో స్ట్రాంగ్‌ అనుకున్న విశ్వ హౌస్‌ నుంచి వెళ్లిపోవడం అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు బిగ్ బాస్ చూసే వారిని సైతం షాకింగ్‌కు గురిచేసింది.

ఇంకా చదవండి ...
    Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మంది ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా విశ్వ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఎంతో స్ట్రాంగ్‌ అనుకున్న విశ్వ హౌస్‌ నుంచి వెళ్లిపోవడం అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు బిగ్ బాస్ చూసే వారిని సైతం షాకింగ్‌కు గురిచేసింది. విశ్వ ఎలిమినేట్‌ అవడం ఏంటనీ ప్రశ్నిస్తున్నారు.. ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అన్ని టాస్క్‌ల్లో అదరగొట్టే విశ్వ ఎలిమినేట్ చాలా మందికి నచ్చడం లేదు.. కొందరైతే ప్రియాంకను, జెస్సీ కాపాడడం కోసం విశ్వను బలి చేశారా.. అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా విశ్వ ఎలిమినేషన్ చాలా మంది నెటిజన్స్‌కు భాదను కలిగిస్తోంది.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

    ఇక అది అలా ఉంటే విశ్వ తొమ్మిది వారాలు ఉండి ఎంత మేరకు వెనుకేశాడు.. అని ఆరా తీస్తున్నారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు అతడికి వారానికి రెండు నుంచి రెండున్నర లక్షల వరకు ముట్టాజెప్పారట బిగ్ బాస్. ఈ లెక్కన చూస్తే విశ్వ 9 వారాలకు సుమారు 22 లక్షలు వెనకేసినట్లు అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో...

    Bigg Boss Telugu 5: ఈ వారం నామినేషన్లో ఉన్న ఐదురుగు సభ్యులు వీళ్లే.. ! డేంజర్ జోన్లో ఆ కంటెస్టెంట్..

    ఇక మరోవైపు ఈసారి బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదని అంటున్నారు కొందరు నెటిజన్స్. హౌజ్‌లో పెద్దగా వేడి లేదని.. అంతా చప్పగా నడుస్తోందని టాక్ నడుస్తోంది. టాస్క్‌లు కూడా లాస్ట్ సీజన్‌లో చేసినవే ఉన్నాయని.. అవే పునరావృతమవుతున్నాయని అంటున్నారు.

    ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సభ్యుల విషయానికి వస్తే.. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఆరవ వారంలో శ్వేతా వర్మ ఏడవ వారంలో ప్రియా, ఎనిమిదవ వారంలో లోబో, ఇక తాజాగా తొమ్మిదవ వారంలో విశ్వ ఎలిమినేట్ అయ్యారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bigg Boss 5 Telugu, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు