Bigg Boss Telugu 5 : సెప్టెంబర్‌లో బిగ్‌బాస్ 5 ప్రారంభం.. పూర్తి జాబితా ఇదే...

Bigg Boss Telugu 5 Photo : Twitter

Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  • Share this:
    Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తిచేసుకున్న ఈ రియాలిటీ షో ఐదవ సీజన్‌కు రెడీ అవుతోంది. అయితే నాల్గవ సీజన్‌లో ఎక్కువుగా సోషల్ మీడియా స్టార్స్ ఉండడంతో కొంత మొఖం విరిచారు బిగ్ బాస్ అభిమానులు. ఈ అనుభవంతో ఈ సారి బిగ్ బాస్ నిర్వాహకులు పాపులర్ అయిన నటీ నటులును తీసుకుంటున్నారు. అంతేకాదు ఈసారి కాస్తా గ్లామర్ డోస్‌ను కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. ఐదో సీజన్ కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సివుంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. మరోవైపు బిగ్ బాస్ సెట్‌ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని సమాచారం. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బిగ్ బాస్ ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభించాలనీ అనుకుంటున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సీజన్ వచ్చే సెప్టెంబర్ 5వ తేదిన మొదలు పెట్టాలనీ నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. ఇక మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేసింది తెలిసిందే. అయితే ఈ సారి నాగార్జున అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ఇంతకు ముందే కమిట్ అయినా సినిమాల కారణంగా నాగార్జున ఈ ఐదవ సీజన్‌ను హోస్ట్ చేయడం కుదరదట. నాగార్జున చేయాల్సిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో పాటు సూపర్ హిట్ సినిమా మనంకు కూడా సీక్వెల్ రాబోతోందట. దీంతో ఆయన ఈ సీజన్‌కు రాకపోవచ్చని.. అంటున్నారు.

    ఇక ఈ ఐదో సీజన్ కోసం అప్పుడే నిర్వహకులు కంటెస్టెంట్ లిస్ట్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, జబర్దస్త్ గెటప్ శ్రీను, రఘు మాస్టర్, సింగర్ మంగ్లీ, న్యూస్ యంకర్ రోజా, నటి సురేఖ వాణి, సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, ప్రేమకావాలి హీరోయిన్ ఈషా చావ్లా, టిక్ టాక్ స్టార్ దుర్గా రావు ఉన్నారని టాక్. చూడాలి మరి ఈ లిస్ట్‌లో ఎంత మంది ఫైనల్‌గా హౌజ్‌లోకి వెళ్తారో..
    Published by:Suresh Rachamalla
    First published: