BIGG BOSS TELUGU 5 THIS SEASON NO MORE WILD CARD ENTRIES AND THESE THREE CONTESTANTS ARE IN THE DANGER ZONE SR
Bigg Boss Telugu 5 : ఈ సారి నో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. డేంజర్ జోన్లో ఆ ముగ్గురు..
Bigg Boss Telugu 5 Photo : Twitter
Bigg Boss Telugu 5 : ఈ వారం కెప్టెన్ షణ్ముఖ్, అనీ మాస్టర్ తప్ప అందరూ ఎలిమినేషన్లో ఉన్నారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ అయిన వారిలో ముఖ్యంగా జెస్సీ, కాజల్, విశ్వ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్ విజయవంతంగా నడుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఆరవ వారంలో శ్వేతా వర్మ ఇక తాజాగా లోబో ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఇంట్లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.
హౌస్‌లో అప్పుడే ఏడువారాలు గడిచిపోయాయి. ఎనిమిదవ వారంలో నడుస్తోంది. ఇప్పటికే ఐదుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠని పెంచేస్తోంది. ఈ వారం కెప్టెన్ షణ్ముఖ్, అనీ మాస్టర్ తప్ప అందరూ నామినేషన్లో ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్ అయిన వారిలో ముఖ్యంగా జెస్సీ, కాజల్, విశ్వ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి ఎవరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారో.. ఇక మరోవైపు ఇప్పటికే షో సగం దాటడంతో వైల్డ్ కార్డ్ ఇక ఉండబోదని తెలుస్తోంది.
అయితే ఈసారి బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదని అంటున్నారు కొందరు నెటిజన్స్. హౌజ్‌లో పెద్దగా వేడి లేదని.. అంతా చప్పగా నడుస్తోందని టాక్ నడుస్తోంది. టాస్క్‌లు కూడా లాస్ట్ సీజన్లో చేసినవే ఉన్నాయని.. అవే పునరావృతమవుతున్నాయని అంటున్నారు.
ఇక తాజా ఎపిసోడ్ విషయానికి వస్తే.. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బుధవారం నాడు శ్రీరామచంద్ర, యాంకర్ రవిలు విజయవంతంగా టాస్కులు పూర్తి చేసి గెలిచారు. ఇక గురువారం రోజు ప్రియాంక టాస్క్‌లో పాల్గొంది. పచ్చి గుడ్డు రసం తాగిన ప్రియాంక టీమ్ కోసం పేడనీటితో స్నానం చేసింది. విలన్ టీమ్‌లో ఉన్న సిరి కత్తెర తీసుకొచ్చి జుట్టు కత్తిరించుకోమని చెప్పగా దానికి రెడీ అవ్వగా.. సిరి వద్దులే అంటూ కత్తెర తీసుకుంది. దీంతో హీరోలు మరోసారి గెలిచారు. ఇక మరోవైపు నిన్న మొన్నటి వరకు క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్న షణ్ముఖ్, సిరిల మధ్య గొడవ జరిగింది. షన్ను అన్న మాటలకు సిరి బయట వెళ్లి పడుకోగా.. ఆమెను కన్విన్స్ చేసి గుంజీలు తీసి అందరి మందు సారీ చెప్పాడు. హీరో టాస్క్‌లో అనీ మాస్టర్ విజేతగా నిలిచారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.