Home /News /movies /

BIGG BOSS TELUGU 5 THIS SEASON NINTH WEEK DOUBLE ELIMINATION AND THESE TWO ARE ELIMINATED FROM THE HOUSE HERE ARE THE DETAILS SR

Bigg Boss Telugu 5 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇంటి నుంచి ఆ ఇద్దరు అవుట్...

Bigg Boss Telugu 5 logo Photo : Twitter

Bigg Boss Telugu 5 logo Photo : Twitter

Bigg Boss Telugu 5 : హౌస్‌లో అప్పుడే ఏనిమిది వారారలు గడిచిపోయాయి. తొమ్మిదో వారం నడుస్తోంది. ఇప్పటికే ఆరుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠని పెంచేస్తోంది.

    Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఆరవ వారంలో శ్వేతా వర్మ ఏడవ వారంలో ప్రియా, ఇక ఎనిమిదవ వారంలో లోబో ఎలిమినేట్ అయ్యారు.  దీంతో ప్రస్తుతం ఇంట్లో 11 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

    హౌస్‌లో అప్పుడే ఏనిమిది వారారలు గడిచిపోయాయి. తొమ్మిదో వారం నడుస్తోంది. ఇప్పటికే ఆరుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠని పెంచేస్తోంది. ఈ వారం కెప్టెన్ షణ్ముఖ్, అనీ మాస్టర్ తప్ప అందరూ  నామినేషన్‌లో ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్ అయిన వారిలో ముఖ్యంగా కాజల్, జెస్సీ, ప్రియాంక, విశ్వ డేంజర్ జోన్‌లో ఉండగా.. తాజాగా కాజల్‌, జెస్సీల కు మిగితా వారితో పోల్చితే ఎక్కువుగా ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. బిగ్ బాస్ హౌస్‌లో మిగిలింది 45 రోజులు మాత్రమే అంటే ఐదు వారాలు మాత్రమే ఉంది.

    Balakrishna | Akhanda : అదరగొడుతోన్న అఖండ టైటిల్ సాంగ్‌ ప్రోమో.. త్రీ మిలియన్ వ్యూస్‌తో రచ్చ..

    ఈ ఐదు వారల్లో కనీసం ఆరుగురిని పంపాలి కాబట్టి.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఇక ఈ డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ప్రియాంక, విశ్వ ఈ వారం ఎలిమినేట్ అవ్వనున్నారని అంటున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే షో సగం దాటడంతో వైల్డ్ కార్డ్ ఇక ఉండబోదని తెలుస్తోంది.

    ఇక మరోవైపు ఈసారి బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదని అంటున్నారు కొందరు నెటిజన్స్. హౌజ్‌లో పెద్దగా వేడి లేదని.. అంతా చప్పగా నడుస్తోందని టాక్ నడుస్తోంది. టాస్క్‌లు కూడా లాస్ట్ సీజన్‌లో చేసినవే ఉన్నాయని.. అవే పునరావృతమవుతున్నాయని అంటున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bigg Boss 5 Telugu, Tollywood news

    తదుపరి వార్తలు