BIGG BOSS TELUGU 5 SHANMUKH AND SIRI HANMANTH LIP LOCK IN BIGG BOSS HOUSE VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA SK
Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌లో లిప్‌లాక్... వామ్మో.. కెమెరాల సాక్షిగా రెచ్చిపోయిన జంట
షణ్ణు, సిరి రొమాన్స్ (Image:Twitter)
Bigg Boss Telugu 5: హౌస్‌లో వీరిద్దరి రొమాన్స్‌పై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి సన్నివేశాల ద్వారా సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చెండాలాన్ని ప్రసారం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ 5 (Bigg BossTelugu 5)లో షణ్ముఖ్ (Shanmukh Jaswanth), సిరి (Siri Hanmanth) వ్యవహారం మామూలుగా లేదు. వీరిద్దరు తెగ క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. హగ్‌లు, ముద్దులతో రెచ్చిపోతూ బిగ్‌బాస్‌కు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అప్పుడప్పుడు అలకలు, కోపాలు.. ఆ తర్వాత ముద్దు ముచ్చట్లు.. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని సోషల్ మీడియాలో బీభత్సమైన టాక్ నడుస్తోంది. కానీ ఈ జంట మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యామని మాత్రమే చెబుతున్నారు. ఐతే గురువారం నాటి ఎపిసోడ్‌లో మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. షణ్ణు, సిరిల రొమాన్స్ తారాస్థాయికి చేరింది. కెమెరాల సాక్షిగా ఈ జంట రెచ్చిపోయింది. హగ్గులే కాదు..ముద్దుల్లో మునిగిపోయారు. షణ్ణుకు సిరి ఏకంగా లిప్ లాక్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
నిన్నటి ఎపిసోడ్‌లో సిరి, షన్నుల మధ్య చిన్న గొడవ జరిగింది. అది ఎందుకు జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఐ హేట్ యూ అంటూ లిప్ స్టిక్‌తో టిష్యూ మీద రాసి షణ్ణుకు ఇచ్చింది సిరి. ఐ హేట్ యూ ఏంట్రా.. అరేయ్ నేను ఏం చేశాను.. అంటూ సిరిని షణ్ణు అడిగాడు. ఆ తర్వాత కాసేపటికే వీరిద్దరు గాఢంగా హత్తుకున్నారు. షణ్ణును దగ్గరకు తీసుకొని హగ్ ఇచ్చింది సిరి. ఐతే లిప్‌లాక్ కూడా పెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఐతే అది అంత స్పష్టంగా కనిపించనప్పటికీ.. ఖచ్చితంగా లిప్ లాక్ పెట్టిందని నెటిజర్లు ఎవరికి వారు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అది లిప్ లాక్ కాదని.. జస్ట్ హగ్ మాత్రమే అని అభిప్రాయపడుతున్నారు. లేదు నిజంగానే ముద్దు పెట్టిందని మరికొందరి వాదన. అందుకే షణ్ణు ఖంగుతిన్నాడని.. అతడి కళ్లు చూస్తేనే అర్ధమవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
— If you are Bad..I am your Dad (@PingPon82285459) November 18, 2021
హౌస్‌లో వీరిద్దరి రొమాన్స్‌పై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి సన్నివేశాల ద్వారా సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చెండాలాన్ని ప్రసారం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Idendayya idi...
Idi nenu sudale....
Tattoolu chuskuntiri,ringulu tippukuntiri...
Weekend lo oh my friend song peditiri
Endi makee sendalam🤮🤮🤮
Nibbesh and nibbeswari.. #Siri and #Shannu
What's this apashyamapam kirirkiri #BiggBossTelugu5pic.twitter.com/rNVWA0hG5l
వాస్తవానికి షణ్ణుకు ఇప్పటికే గర్ల్ ఫ్రెండ్ ఉంది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునయనతో ఆయన పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. సిరి కూడా శ్రీహాన్‌తో ప్రేమిస్తోంది. ఓ టీవీ కార్యక్రమంలో వీరిద్దరికి ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. ఐనప్పటికీ సిరి, షణ్ణు మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజంగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నారా? లేదంటే బిగ్ బాస్ కంటెంట్ కోసమే లవ్ ట్రాక్‌ను వాడుకుంటున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి మసాలా ఉంటేనే హౌస్‌లో చివరి వరకు ఉండగలమని భావించి.. పక్కా ప్లాన్‌తోనే ఇలా చేస్తున్నారా? అని సోషల్ మీడియాలో పశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తంగా హౌస్‌లో వీరిద్దరి వ్యవహార శైలి మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.