Home /News /movies /

BIGG BOSS TELUGU 5 PRIYA OR ANNE MASTER WHO WILL BE ELIMINATED IN THE SEVENTH WEEK FROM THE BIG BOSS HOUSE HERE ARE THE DETAILS SR

Bigg Boss Telugu 5 : తప్పించుకున్న లోబో.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే..

Bigg Boss Telugu 5 Photo : Twitter

Bigg Boss Telugu 5 Photo : Twitter

Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఐదవ సీజన్‌ ఇటీవలే మొదలైన మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. కాగా ఈ వారం డేంజర్‌ జోన్‌లో ప్రియా, అనీ మాస్టర్‌లు ఉన్నారు.

ఇంకా చదవండి ...
    Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఆరుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఆరవ వారంలో శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఇంట్లో 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

    హౌస్‌లో అప్పుడే ఆరువారాలు గడిచిపోయాయి. ఇందులో భాగంగా ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠని పెంచేస్తోంది. నామినేషన్‌లో ఉన్న వారిలో ముఖ్యంగా అనీమాస్టర్, లోబో, ప్రియా డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది.

    Bheemla Nayak : అమెజాన్ ప్రైమ్‌లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌.. 150 కోట్ల డీల్‌...

    అయితే తాజా సమాచారం మేరకు లోబోకు కాస్తా ఎక్కువుగా ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఈ వారం ప్రియా, అనీ మాస్టర్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరులో అనీ మాస్టర్ ఎలిమినేట్ కానుందని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

    ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు తమ జీవితంలో ఏర్పడ్డ అడ్డంకులు గురించి తెలిపారు. సన్నీ మాట్లాడుతూ.. తాను ఎన్నోఅవమానాలు ఎదుర్కొన్నానని.. ముగ్గురు అబ్బాయిలని పెంచడం తన తల్లికి ఛాలెంజింగ్‌గా ఉండేదని తెలిపారు. ఇక షణ్ముఖ్‌ మాట్లాడుతూ.. ‘ఇంటర్‌ సెకండియర్‌ తర్వాత బెంగళూరులో సీటు వచ్చింది.. అయితే అదే సమయంలో లవ్‌ బ్రేకప్‌ కావడంతో నా సగం జీవితం పోయిందని చాలా ఫీలయ్యాను. ఓ దశలో సూసైడ్ కూడా చేసుకుందామని అనుకున్నాను అని వివరించారు.

    HBD Rebel Star Prabhas : రెబల్ స్టార్‌ టూ ప్యాన్ ఇండియా స్టార్‌గా ఆకాశమే హద్దుగా ప్రభాస్ సినీ ప్రస్థానం..

    ఇక అది అలా ఉంటే ఈసారి బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదని అంటున్నారు కొందరు నెటిజన్స్. హౌజ్‌లో పెద్దగా వేడి లేదని.. అంతా చప్పగా నడుస్తోందని టాక్. టాస్క్‌లు కూడా లాస్ట్ సీజన్‌లో చేసినవే ఉన్నాయని.. అవే పునరావృతమవుతున్నాయని అంటున్నారు. ఇక ఇంత వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా లేదని.. ఇంకేప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bigg Boss 5 Telugu, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు