Bigg Boss Telugu 5 : ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసింది.. ఇది షాకింగ్ విషయమే....

Bigg Boss Telugu 5 Photo : Twitter

Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఐదవ సీజన్‌ ఇటీవలే మొదలైన మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. కాగా ఈ వారం డేంజర్‌ జోన్‌లో ప్రియా, అనీ మాస్టర్‌లు ఉన్నారు.

 • Share this:
  Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటే ఆరుగురు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ విషయానికి వస్తే.. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఆరవ వారంలో శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఇంట్లో 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

  హౌస్‌లో అప్పుడే ఆరువారాలు గడిచిపోయాయి. ఇందులో భాగంగా ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఈ ఏడవ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠని పెంచేస్తోంది. నామినేషన్‌లో ఉన్న వారిలో ముఖ్యంగా అనీమాస్టర్, లోబో, ప్రియా డేంజర్ జోన్‌లో ఉన్నారు.

  Prabhas | Radhe Shyam Teaser : అందరి రికార్డ్స్‌ను కొట్టేసిన రాధేశ్యామ్ టీజర్.. టాలీవుడ్ రారాజుగా ప్రభాస్..

  అయితే తెలుస్తోన్న తాజా సమాచారం మేరకు లోబోకు, అనీ మాస్టర్‌కు ప్రియాతో పోల్చితే కాస్తా ఎక్కువుగా ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఈ వారం ప్రియా బిగ్ హౌజ్‌నుంచి ఎలిమినేట్ అయ్యినట్లు తెలుస్తోంది. ప్రియా విషయానికి వస్తే.. మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ లోనే హౌస్ లోకి వెళ్లింది ప్రియా.. అయినా కూడా మిగితా వారి కంటే తక్కువుగా ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యిందని సమాచారం. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

  Pelli Sandadi : పెళ్లి సందD హీరోయిన్‌కు వరుస ఆఫర్స్.. చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు...

  ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ముఖ్యాంశాలను చూస్తూ.. ఈ వారం కెప్టెన్‌గా ఎంపికైన స‌న్నీ రేష‌న్ మేనేజ‌ర్‌గా కాజ‌ల్‌ని ఎంపిక చేశారు. ఇక ఆ తర్వాత స‌రైన మ్యాచ్‌ టాక్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు తమకు కాబోయే పార్ట్ నర్ ఎలా ఉండాలో అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత అందరూ ప్రియాంక సింగ్‌కు మానస్‌ను బెస్ట్‌ కపుల్‌గా పేర్కొంటూ.. పూలదండలు మార్చుకునేలా చేసి పెళ్లి జరిపించారు. ఇక ప్ర‌తివారం జరిగే హౌజ్‌లో బెస్ట్‌, వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్ టాస్క్‌లో భాగంగా విశ్వను వరస్ట్ పర్‌ఫార్మర్‌గా నిర్ణయించారు ఇంటి సభ్యులు..

  ఇక అది అలా ఉంటే ఈసారి బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదని అంటున్నారు కొందరు నెటిజన్స్. హౌజ్‌లో పెద్దగా వేడి లేదని.. అంతా చప్పగా నడుస్తోందని టాక్. టాస్క్‌లు కూడా లాస్ట్ సీజన్‌లో చేసినవే ఉన్నాయని.. అవే పునరావృతమవుతున్నాయని అంటున్నారు. ఇక ఇంత వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా లేదని.. ఇంకేప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published: