Bigg Boss 5 Telugu 12th week Elimination: బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ 5 లో ఇప్పటి వరకు 12 వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్లో మొదటి నుంచి కూడా ఐదుగురు డేంజర్ జోన్లో ఉన్నారంటూ చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో కాజల్, పింకీ, యాంకర్ రవి, సిరి మరియు శ్రీరామ చంద్ర. అయితే ఇందులో ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే.
తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 5 (Bigg Boss 5 Telugu) . ఈ రియాలిటీ షో ప్రస్తుతం 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక రెండు రోజులు ఆగితే 13 వ వారంలోకి అడుగెడుతుంది. ప్రతీ ఒక్కరూ తమదైన శైలిలో ఆటల్లో ఇచ్చి పడేస్తున్నారు. తగ్గేదేలె అన్నట్లు ఆట ఆడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియలో కూడా అదే విధంగా దూకుడుగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఇక గత రెండు, మూడు రోజుల నుంచి హౌస్ లో ఉన్న వాళ్లకు కాస్త ఉపశమనం కలిగించే విధంగా.. ఫ్యామిలీ మెంబర్స్ ను (Family Members) హౌస్ లోకి పంపించారు. ఫ్యామిలీ డ్రామాతో హౌస్ అంతా భావోద్వేగాల నడుమ నడిచింది.
దాదాపు ప్రతీ ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక 12 వ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యుల్లో ఒక్క మానస్ తప్ప అందరూ ఉన్నారు. అయితే ఇందులో సన్నీ, షణ్ముఖ్ లు ఇద్దరూ నువ్వా.. నేనా అన్నట్లు ఓటింగ్ లో దూసుకుపోయారు. వీరిద్దరికీ ఎలాంటి ఎలిమినేషన్ గండం అనేది లేదని చెప్పుకుంటూ వస్తున్నాం.
అయితే ఈ వారం ఎలిమినేషన్లో మొదటి నుంచి కూడా ఐదుగురు డేంజర్లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అందులో కాజల్, పింకీ, యాంకర్ రవి, సిరి మరియు శ్రీరామ చంద్ర. వీళ్లందరికీ ప్రైవేట్ వెబ్ సైట్లో ఓటింగ్ శాతం అనేది సమానంగా వచ్చాయి. మొన్నటి వరకు సిరి, ప్రియాంక సింగ్ లో ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నారు కానీ.. ఎవరూ ఊహించని విధంగా జరిగిపోయింది.
యాంకర్ రవి (Anchor Ravi) ఎలిమినేట్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం విన్న రవి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రవి కంటే సిరి, ప్రియాంక, కాజల్‌కు ఎక్కువ ఓట్లు రావడం నమ్మశక్యంగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే రవి ఫ్యామిలీ హౌస్ లోకి వచ్చింది. తన కూతురిని ఎత్తుకొని పొంగిపోయాడు రవి.
తన కూతురు ఏడుస్తుంటే.. మరో మూడు వారాల్లో వచ్చేస్తానంటూ సముదాయించారు. కానీ ఈ వారమే వెళ్లిపోతుండటంతో హౌస్ సభ్యులు కూడా షాక్ కు గురయ్యారు. ఇక నెటిజన్లు కూడా ఈ ఎలిమినేషన్ పై గుర్రుగా ఉన్నారు. పింకీ కంటే రవికి ఓట్లు తక్కువ రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా లీకు రాజాలు చెప్పింది నిజమా.. కాదా అనేది రేపటి వరకు వేచి చూడాల్సిందే.
ఇక ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ రేసులో ఇద్దరు కనిపిస్తున్నారు. ఇప్పటి వరకైతే సన్నీ కి ఓట్లు బాగానే వస్తున్నట్లు సమాచారం. రెండో స్థానంలో షణ్ముఖ్ ఉన్నారు. వీరద్దరిలోనే ఎవరో ఒకరు టైటిల్ గెలుస్తారనేది బయట వినిపిస్తున్న టాక్.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.