BIGG BOSS TELUGU 5 LATEST NEWS THIS CONTEST ELIMINATE FROM THE HOUSE IN THE TENTH WEEK HERE ARE THE DETAILS SR
Bigg Boss Telugu 5 : ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసింది..
బిగ్ బాస్ తెలుగు 5
Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్ విజయవంతంగా నడుస్తోంది.
Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్ విజయవంతంగా నడుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మంది ఎలిమినేట్ అవ్వగా.. తొమ్మిదో వారం విశ్వ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఎంతో స్ట్రాంగ్ అనుకున్న విశ్వ హౌస్ నుంచి వెళ్లిపోవడం అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు బిగ్ బాస్ చూసే వారిని సైతం షాకింగ్‌కు గురిచేసింది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. హౌజ్‌లో 9 మంది ఉన్నారు. జస్వంత్ సీక్రెట్ రూమ్‌లో ఉన్నారు. ఇక బీబీ హోటల్ అంటూ బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌లో విజేతగా నిలిచిన రవి ఇంటి కెప్టెన్ అయ్యారు.
ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సభ్యుల విషయానికి వస్తే.. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఆరవ వారంలో శ్వేతా వర్మ ఏడవ వారంలో ప్రియా, ఎనిమిదవ వారంలో లోబో, ఇక తాజాగా తొమ్మిదవ వారంలో విశ్వ ఎలిమినేట్ అయ్యారు.
లేటెస్ట్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఇచ్చిన బీబీ హోటల్లో అతిథుల నుంచి రూ.15వేలు రాబట్టలేకపోయినందుకు హోటల్ టీమ్ ఓడిపోయినట్లు ప్రకటించారు బిగ్ బాస్. కాగా బాగా ఆడినందుకు హోటల్ టీమ్‌కు స్పెషల్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో అతిథుల టీమ్ నుంచి సరిగా ప్రదర్శన చేయని ఇద్దరిని కెప్టెన్సీకి అనర్హులుగా ప్రకటించాలని సూచించారు బిగ్ బాస్. ఈ క్రమంలో శ్రీరామ్ మినహా మిగిలిన సభ్యులు పింకీ, మానస్లు అనర్హులని తెలిపారు. ఇక సీక్రెట్ టాస్క్‌లో విజయం సాధించిన రవి నేరుగా కెప్టెన్సీ పోటీదారుడు అయ్యారు.
ఇక 'టవర్‌లో ఉంది పవర్' టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో చివరి బజర్‌లో షణ్ముఖ్ వీపు తగిలి సిరి బ్లాక్స్ పడిపోవడంతో రవి ఇంటి కొత్త కెప్టెన్ అయ్యారు. మరోవైపు ఈవారం నామినేషన్స్‌లో సన్నీ, మానస్, కాజల్, సిరి, రవిలు ఉన్నారు. వీరిలో ఈ రోజు కాజల్ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. కాజల్‌కి మిగితా వారితో పోల్చితే తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అవ్వనుందని అంటున్నారు. కొద్దిలో మానస్ ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
మరోవైపు ఈసారి బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదని అంటున్నారు కొందరు నెటిజన్స్. హౌజ్‌లో పెద్దగా వేడి లేదని.. అంతా చప్పగా నడుస్తోందని టాక్ నడుస్తోంది. టాస్క్‌లు కూడా లాస్ట్ సీజన్లో చేసినవే ఉన్నాయని.. అవే పునరావృతమవుతున్నాయని అంటున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.