Home /News /movies /

BIGG BOSS TELUGU 5 LATEST NEWS THIS CONTEST ELIMINATE FROM THE HOUSE IN THE ELEVEN WEEK HERE ARE THE DETAILS SR

Bigg Boss Telugu 5 : ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసింది..

Bigg Boss Telugu 5 logo Photo : Twitter

Bigg Boss Telugu 5 logo Photo : Twitter

Bigg Boss Telugu 5 : ఇక లేటెస్ట్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మానస్ కెప్టెన్ అయ్యారు. ప్రస్తుతం ఎవిక్షన్ పాస్‌కు సంబంధించిన టాస్క్ జరుగుతోంది. సన్నీ ఎవిక్షన్ ప్రీ పాస్‌ను పొందనున్నారు.

    Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మంది ఎలిమినేట్ అవ్వగా.. తొమ్మిదో వారం విశ్వ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఎంతో స్ట్రాంగ్‌ అనుకున్న విశ్వ హౌస్‌ నుంచి వెళ్లిపోవడం అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు బిగ్ బాస్ చూసే వారిని సైతం షాకింగ్‌కు గురిచేసింది. ఇక ఆ తర్వాత అనారోగ్యం కారణంగా జెస్సీ ఇంటి నుంచి పదవవారంలో బయటకు వచ్చారు. ఇక పదకొండవ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ అభిమానులు.

    ఈ వారం నామినేషన్‌లో కెప్టెన్‌గా ఉన్న రవి మినహా అందరూ నామినేట్ అయ్యారు. అయితే అందరిలో కాజల్, అనీ, సిరిలు మాత్రం డేంజర్‌ జోన్‌లో ఉండగా.. సిరి ఇద్దరితో పోల్చితే మాత్రం ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె సేవ్ అయ్యారట. ఇక డేంజర్ జోన్‌లో ఉన్న కాజల్, అనీలలో కాజల్‌కు అనీతో పోల్చితే ఎక్కువ ఓట్లు రావడంతో కాజల్ సేవ్ అయ్యిందని.. దీంతో ఈ వారం అనీ మాస్టర్ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.

    Nagarjuna - Bangarraju : నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్‌కు ముహూర్తం ఖరారు..

    ఇక లేటెస్ట్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మానస్ కెప్టెన్ అయ్యారు. ప్రస్తుతం ఎవిక్షన్ పాస్‌కు సంబంధించిన టాస్క్ జరుగుతోంది. సన్నీ ఎవిక్షన్ ప్రీ పాస్‌ను పొందనున్నారు. ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సభ్యుల విషయానికి వస్తే.. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు.

    ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఆరవ వారంలో శ్వేతా వర్మ ఏడవ వారంలో ప్రియా, ఎనిమిదవ వారంలో లోబో, ఇక తాజాగా తొమ్మిదవ వారంలో విశ్వ ఎలిమినేట్ అయ్యారు. పదవవారంలో జెస్సీ ఆరోగ్యం బాగలేక ఇంటి నుంచి బయటకు వచ్చారు.

    ఇక మరోవైపు ఈసారి బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదని అంటున్నారు కొందరు నెటిజన్స్. హౌజ్‌లో పెద్దగా వేడి లేదని.. అంతా చప్పగా నడుస్తోందని టాక్ నడుస్తోంది. టాస్క్‌లు కూడా లాస్ట్ సీజన్‌లో చేసినవే ఉన్నాయని.. అవే పునరావృతమవుతున్నాయని అంటున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bigg Boss 5 Telugu, Bigg boss telugu 5, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు