Home /News /movies /

Bigg Boss Telugu 5 : హనీమూన్‌‌కు వెళ్లిన బిగ్‌బాస్ ప్రేమ పావురాలు.. మానస్-ప్రియాంక...

Bigg Boss Telugu 5 : హనీమూన్‌‌కు వెళ్లిన బిగ్‌బాస్ ప్రేమ పావురాలు.. మానస్-ప్రియాంక...

Manas, Priyanka Photo : Twitter

Manas, Priyanka Photo : Twitter

Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది.

    Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మంది ఎలిమినేట్ అవ్వగా.. తొమ్మిదో వారం విశ్వ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఎంతో స్ట్రాంగ్‌ అనుకున్న విశ్వ హౌస్‌ నుంచి వెళ్లిపోవడం అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు బిగ్ బాస్ చూసే వారిని సైతం షాకింగ్‌కు గురిచేసింది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. హౌజ్‌లో 9 మంది ఉన్నారు. జ‌స్వంత్ సీక్రెట్ రూమ్‌లో ఉన్నారు. ఇక బీబీ హోటల్ అంటూ బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చారు.

    ఈ బీబీ హోట‌ల్‌లో శ్రీరామ్‌, షణ్ముఖ్‌ చెఫ్స్ అండ్ వేయిటర్స్‌గా ఉంటారు. యానీ మాస్టర్‌ మేనేజర్‌గా ఉంటారు. రవి హౌస్‌ కీపింగ్‌, సన్నీ తొలిసారి 5 స్టార్‌ హోటల్‌కు వచ్చిన అతిథిగా, సిరి డాన్‌ కూతురుగా నటిస్తారు. ఇక బిగ్ బాస్ ప్రేమ పావురాలు మానస్‌, ప్రియాంక హనీమూన్‌కు వచ్చిన జంటగా వస్తారు. కాజల్‌ హోటల్‌ ఓనర్‌కు స్నేహితురాలుగా నటించాల్సీ ఉంది. ఈ టాస్క్‌లో హోట‌ల్ సిబ్బంది అతిథ‌లు నుండి 15 వేల రూపాయ‌లు గెలిస్తే వారు టాస్క్‌లో విన్ అయ్యి కెప్టెన్సీకీ పోటీదారులుగా నిలుస్తారు. అందరిలో సన్నీ అదరగొట్టారు.. హోటల్‌లో తన కామెడీతో అదరగొట్టారు. మరోవైపు మానస్‌ ప్రియాంకలు కూడా తమ రొమాన్స్‌తో కేకపెట్టించారు. ఇక సిరి డాన్ కూతురుగా షణ్ముఖ్‌ను ఓ ఆట ఆడేసుకున్నారు.

    Chiranjeevi | Bhola Shankar : చిరంజీవి భోళా శంకర్ లాంఛనంగా ప్రారంభం... 15 నుంచి షూటింగ్ షురూ..

    ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సభ్యుల విషయానికి వస్తే.. ప్రతీసారి 16 మంది ఇంటి సభ్యులు వచ్చేవాళ్లు అయితే ఈ సారి మాత్రం మరో ముగ్గురిని ఎక్స్ ట్రా తీసుకొచ్చారు. ఈ సారి ఇంటిని 19 మంది సభ్యులతో నింపారు. ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఆరవ వారంలో శ్వేతా వర్మ ఏడవ వారంలో ప్రియా, ఎనిమిదవ వారంలో లోబో, ఇక తాజాగా తొమ్మిదవ వారంలో విశ్వ ఎలిమినేట్ అయ్యారు.

    మరోవైపు ఈసారి బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదని అంటున్నారు కొందరు నెటిజన్స్. హౌజ్‌లో పెద్దగా వేడి లేదని.. అంతా చప్పగా నడుస్తోందని టాక్ నడుస్తోంది. టాస్క్‌లు కూడా లాస్ట్ సీజన్‌లో చేసినవే ఉన్నాయని.. అవే పునరావృతమవుతున్నాయని అంటున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bigg Boss 5 Telugu, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు