BIGG BOSS TELUGU 5 FIRST LAUNCHING EPISODE TRP RATING VERY LOW HERE ARE THE DETAILS TA
Bigg Boss Telugu 5 : బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జునకు పరాభవం.. ఫస్ట్ ఎపిసోడ్‌తోనే దారుణమైన రేటింగ్..
బిగ్‌బాస్ సీజన్ 5 నాగార్జున (Twitter/Photo)
Bigg Boss Telugu 5 : గత నాలుగు సీజన్స్‌తో పోలిస్తే ఐదు సీజన్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్‌ను ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల నిర్వహించారు. ఇంత చేసిన బిగ్‌బాస్ సీజన్ 5 లాంచింగ్ ఎపిసోడ్‌కు దారుణమైన రేటింగ్ మూటగట్టుకుంది.
Bigg Boss Telugu 5 : బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున (Nagarjuna)కు పరాభవం.. ఫస్ట్ ఎపిసోడ్‌తోనే దారుణమైన రేటింగ్ సంపాదించుకుంది. ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన ఈ షో ముందుగా హిందీ ప్రేక్షకులను అలరించింది. ఆ తరవాత నెమ్మది నెమ్మదిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ (NTR Jr )ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సెకండ్ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని (Nani) హోస్ట్‌గా ఉన్నారు. ఇక మూడో, నాలుగు సీజన్స్‌కు మాత్రం నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించారు. తాజాగా ఐదోసారి బిగ్‌బాస్ సీజన్ 5ను నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్లలో ఇద్దరిలో ఎవరు ఒకరు విజేతలుగా నిలుస్తారని అపుడే గుసగుసలు మొదలయ్యాయి.
తాజాగా ప్రసారమైన బిగ్‌బాస్ లాంఛింగ్ ఎపిసోడ్‌కు దారుణమైన రేటింగ్ వచ్చింది. గతంలో లాగా నాగార్జున హోస్ట్‌గా అంతగా మెప్పించలేకపోతున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గత రెండు సీజన్స్లలో అలరించిన విధంగా నాగార్జున హౌస్‌మేట్స్‌తో అలరించలేకపోతున్నాడనే టాక్ కూడా వినబడుతోంది. సెప్టెంబర్ 5న ఎంతో అట్టహాసంగా 19 మంది కంటెస్టెంట్స్‌తో ఈ షో ప్రారంభమైంది. ఇప్పటికే ఈ షో నుండి సరయు హౌస్ నుండి ఎలిమిట్ అయింది.
రెండో వారం ఉమా దేవితో పాటు పలువురు పేర్లు వినిపిస్తున్నా.. ఆమెను హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. తాజాగా ఈ సీజన్‌కు ఫస్ట్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 15.71 రేటింగ్ వచ్చింది. ఈ రేటింగ్ బాగున్నా.. గత నాలుగు సీజన్స్‌తో పోల్చితే దారుణమంటున్నారు.
బిగ్‌బాస్ తొలిసారి టీవీల్లో ప్రసారమైనపుడు ఫస్ట్ ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్ వచ్చింది. రెండో సీజన్‌కు 15.05 వచ్చింది. ఇదే అత్యంత తక్కువ అని చెప్పాలి. ఆ తర్వాత మూడో సీజన్‌కు 17.9 టీఆర్పీ సాధించింది. నాల్గో సీజన్ అదిరిపోయే రీతిలో 18.5 టీఆర్పీ సాధించి కెవ్వు కేక పుట్టించింది. మూడు నాలుగు సీజన్స్లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించినపుడు ఈ ప్రోగ్రామ్‌కు అదిరిపోయే రీతిలో రేటింగ్ వచ్చింది. కానీ ఐదో సీజన్‌కు మాత్రం పేలవమైన టీఆర్పీ సాధించడంపై స్టార్ మా నిర్వాహకులకు మింగుడు పడటం లేదు.
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అన్నట్టు మొదటి లాంఛింగ్ ఎపిసోడ్‌తోనే దారుణమైన ఫలితం రావడంపై మల్లగుల్లు పడుతున్నారు. పైగా హౌస్‌లో ఉండే కంటెస్టెంట్స్‌లతో ఎవరు పెద్దగా తెలిసిన ముఖాలు లేకపోవడం బిగ్‌బాస్ సీజన్ 5కు పెద్ద మైనస్ అని చెప్పుకుంటున్నారు.పైగా బిగ్‌బాస్ వల్ల సామాన్య ప్రజలకు పెద్దగా ఒరిగేదేమి లేదు అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.
హౌస్‌లో కంటెస్టెంట్స్ చిత్ర, విచిత్రంగా సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తిస్తున్నారనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. పైగా మన భారతీయ సాంప్రదాయాలను మంట గలిపే ప్రోగ్రామ్ అంటూ కొంత మంది సాంప్రదాయ వాదులు ఈ షోను బ్యాన్ చేయాలంటూ గళమెత్తుతున్నారు. మొత్తంగా ఇదివరకటిలా ఈ షో అంత కిక్ ఇవ్వడం లేదనే కామెంట్స్ వినబడుతున్నాయి. మొత్తంగా బిగ్‌బాస్ సీజన్ 5ను నాగార్జున ఏ విధంగా విజయ తీరాలకు చేరుస్తా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.