• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS TELUGU 4 UPDATE WITHOUT AVINASH HOUSE BECOMES DULL SAYS NETIZENS SR

Bigg Boss Telugu 4 : హౌజ్‌లో అవినాష్ లేని లోటు స్పష్టం.. ఫన్ మిస్సైందిగా..

Bigg Boss Telugu 4 : హౌజ్‌లో అవినాష్ లేని లోటు స్పష్టం.. ఫన్ మిస్సైందిగా..

అవినాష్ Photo : Instagram

Bigg Boss Telugu 4 : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రేటింగ్స్ మొదట్లో మందగించిన.. ఆ తర్వాత పుంజుకుని దుమ్ము దులుపుతోంది.

  • Share this:
    తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రేటింగ్స్ మొదట్లో మందగించిన.. ఆ తర్వాత పుంజుకుని దుమ్ము దులుపుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇక బిగ్ బాస్ షో రెండు వారాలే ఉండడం, మరోవైపు ఈ నాల్గవ సీజన్‌లో విన్నర్‌ ఎవరు అవుతారు.. వారి ఆట తీరు ఎలా ఉంది అని చూస్తున్నారు జనాలు. దీంతో రేటింగ్స్ అదిరిపోతున్నాయి. ఇక తమ అభిమాన కంటెస్టెంట్ గనుక ఎలిమినేషన్‌లో ఉంటే అతన్నిలేదా ఆమెను రక్షించే చర్యల్లో భాగంగా విపరీతంగా ఓటింగ్ చేస్తున్నారు. దీంతో గత వారం ఏకంగా పదిన్నర కోట్ల ఓట్లు వచ్చాయని నాగార్జున బిగ్ బాస్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి అని కూడా పేర్కోన్నాడు నాగార్జున. ఇక 13వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా ఇంటినుంచి జబర్దస్త్ కమెడియన్ అవినాష్ వెళ్లిపోయాడు. ఎలిమినేషన్‌ లో ఉన్న ఐదుగురులో అవినాష్‌కు తక్కువ ఓట్లు పడడంతో ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు. పోయిన వారం ఎలిమినేషన్‌లో అభిజీత్, హారిక, అవినాష్, అఖిల్, మోనాల్‌లు ఉండగా.. ఓటింగ్ ప్రక్రియలో భాగంగా అవినాష్ అలానే మోనాల్ ల మధ్య తీవ్ర పోటీ జరిగిందని చివరికి మోనాల్ ఒకింత ఎక్కువ ఓటింగ్ దక్కించుకోవడంతో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు.

    అయితే అవినాష్ ఎలిమినేట్ అవ్వడంతో ఇంట్లో ఆయన లోటు స్పష్టంగా కనబడుతోంది. హౌజ్‌లో ఫన్ మిస్ అయ్యిందని అంటున్నారు నెటిజన్స్. అవినాష్ తన కామెడీతో పాటు.. మిమిక్రి లాంటివి చేస్తూ ఎప్పుడూ హౌజ్‌లో అల్లరి చేసే వాడని.. ఇపుడు అది మిస్ అయ్యిందని అంటున్నారు. అతడు ఒకవేళ హౌస్ లో మరికొద్దిరోజులు ఉండి ఉంటె తప్పకుండా నిన్నటి ఎపిసోడ్, తో పాటు రాబోయే రోజుల్లో షో మరింత ఆసక్తికరంగా ముందుకు సాగి ఉండేదని పలువురు ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు తమ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

    బిగ్ బాస్ షో ఇప్పటికే 14వ వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్‌లో భాగంగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో గ్రాండ్ ఫైనాలే మెడల్ గెలుచుకున్న అఖిల్ తప్ప మిగతా ఐదుగురు కంటెస్టెంట్స్ అంటే.. అభిజీత్, హారిక, అరియనా, సోహెల్, మోనాల్‌లు ఎలిమినేషన్‌లో ఉన్నారని ప్రకటించాడు బిగ్ బాస్. అంతేకాదు ఈ సీజన్‌కు ఇదే చివరి ఎలిమినేషన్ ప్రక్రియ అంటూ బిగ్ బాస్ తెలిపాడు. ఇక నిన్న జరిగిన రాజు టాస్క్.. సోహెల్ కారణంగా కొంత సందడిగా మారింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు