Bigg Boss Telugu 4: ఈ వారం ఇద్దరు అవుట్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ జోకర్..

Telugu Bigg Boss Season 4: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ ఈ సారి కొంత లేటైనా ఇప్పుడే అసలైన ఎంటర్ టైన్’మెంట్ మొదలైంది.

news18-telugu
Updated: September 18, 2020, 11:19 AM IST
Bigg Boss Telugu 4: ఈ వారం ఇద్దరు అవుట్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ జోకర్..
బిగ్ బాస్ తెలుగు 4 లోగో Photo : Twitter
  • Share this:
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ ఈ సారి కొంత లేటైనా ఇప్పుడే అసలైన ఎంటర్ టైన్మెంట్ మొదలైంది.  పోయిన వారం సూర్య కిరణ్ ఎలిమినేషన్ అయ్యాడు. అయితే షో ప్రారంభ‌మైన వారం రోజులకే బిగ్‌బాస్ నిర్వాహ‌కులు వైల్డ్ కార్డ్ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు. అందులో భాగంగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా “ఈరోజుల్లో” బస్టాప్ ఫేమ్ సాయి కుమార్ హౌజ్’లోకి వచ్చాడు. మొదటి వారంలో నీరసంగా సాగిన షో రెండోవారంలోకి వచ్చేసరికి పూర్తి వినోదాత్మకంగా మారింది. ఓ ప్రేమకథ కూడా స్టార్ట్ అయ్యింది. అభిజిత్, అఖిల్, మునాల్..ల ముక్కోణపు ప్రేమకథ ఆసక్తి కరంగా సాగుతోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ కి ఏకంగా 9 మందిని నామినేట్ చేశారు. ఇక రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రానుందని తెలుస్తోంది. అందులో భాగంగా తాజా ప్రోమోలో ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు.అంతేకాదు ఆ వ్యక్తి తనను తాను జోకర్ గా పరిచయం చేసుకున్నాడు. దీంతో జబర్దస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈరోజుల్లో ఫేమ్ సాయి కుమార్ మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌజ్‌లోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే.

ఇక మరో ఇంట్రేస్టింగ్ అంశం ఏమంటే.. ఈ వారం ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. హౌస్ లో మొత్తం 16 మంది ఉండగా.. మొదటి వారంలో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఆయన స్థానంలో సాయి కుమార్ వచ్చేశాడు. ఇప్పుడు జబర్దాస్త్ అవినాష్ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ వారం ఇద్దరు బయటకు వెళతారని సమాచారం. అందులో ఒకరు కరాటే కల్యాణి అని తెలుస్తోంది. అంతేకాదు ఆమె ఎలిమినేషన్ దాదాపుగా ఖారారైందట. ఆమెతో పాటు మరోకరు కూడా బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే అది గంగవ్వే కావచ్చనేది టాక్. కారణం ఆమెకు అక్కడి వాతావరణం పెద్దగా నచ్చట్లేదట. దీంతో బయటకు వెళ్ళిపోవాలని కోరుకుంటోందట గంగవ్వ.
Published by: Suresh Rachamalla
First published: September 17, 2020, 11:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading