హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss Telugu 4 Lasya : మొదటి బిడ్డను కావాలనే చంపేసుకున్నా.. బిగ్ బాస్‌లో లాస్య..

Bigg Boss Telugu 4 Lasya : మొదటి బిడ్డను కావాలనే చంపేసుకున్నా.. బిగ్ బాస్‌లో లాస్య..

బిగ్ బాస్ 4 లాస్య (Bigg Boss 4 Lasya)

బిగ్ బాస్ 4 లాస్య (Bigg Boss 4 Lasya)

Bigg Boss Telugu 4 Lasya : తెలుగు యాంకర్‌లలో లాస్యది ప్రత్యేకమైన స్థానం. చీమ ఏనుగు జోక్స్‌తో సమ్ థింగ్ స్పెషల్ అంటూ క్యూట్ యాంకర్‌గా పేరుతెచ్చుకుంది.

Bigg Boss Telugu 4 Lasya : తెలుగు యాంకర్‌లలో లాస్యది ప్రత్యేకమైన స్థానం. చీమ ఏనుగు జోక్స్‌తో సమ్ థింగ్ స్పెషల్ అంటూ క్యూట్ యాంకర్‌గా పేరుతెచ్చుకుంది. అనసూయ, రష్మీ, శ్రీముఖి.. లాంటివాళ్లతో పోటీని తట్టుకంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొంది లాస్య. చురుకైన యాటిట్యూడ్ ఆకట్టుకొనే.. లాస్య కొన్నాళ్లుగా బుల్లితెరపై కనిపించడం లేదు. కాగా ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ షో నాల్గవ సీజన్ ‌లో ఓ కంటెస్టెంట్’గా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే టీవీ తెరపై చలాకీ మాటలతో ప్రేక్షకులకి అలరించే లాస్య జీవితంలోను ఎన్నో విషాద గాధలు ఉన్నాయి. అందులో కొన్ని తాజాగా బిగ్ బాస్ వేదికగా బయటపెట్టింది. బిగ్ బాస్ 61వ ఎపిసోడ్‌లో ఓ టాస్క్‌లో భాగంగా సమాజం కోసం లేదా వేరే వాళ్ల జీవితంలో వెలుగులు నింపిన సంఘటనలు ఉంటే ఇంటి సభ్యులతో పంచుకోవాలని బిగ్‌బాస్‌ కోరాడు. దీంతో.. తాను జీవితంలో చేసిన తప్పును, ఇంతవరకు ఎవ్వరికీ తెలియని విషయాన్ని బిగ్ బాస్ వేదికగా అందరితో పంచుకుంది లాస్య. ఈ సందర్భంగా లాస్య తన కడుపులో బిడ్డని చంపుకున్న విషయాన్ని చెబుతూ కన్నీరు పెట్టుకుంది.

Bigg Boss Telugu 4 news, lasya real life story, achor lasya dob, lasya bigg boss, bogg boss lasya age, anchor lasya husband details, anchor lasya family, bigg boss 4 telugu latest, బిగ్ బాస్ 4 తెలుగు, యాంకర్ లాస్య, యాంకర్ లాస్య భర్త ఎవరు, యాంకర్ లాస్య వివరాలు
లాస్య Photo : Star maa

లాస్య మాట్లాడుతూ.. 2010లో నాకు పెళ్లైంది. అయితే నాకు పెళ్లైనా విషయం చాలా మందికి తెలీదు. నాకు 2010లో పెళ్లైనా మీము వేరు వేరుగా ఉన్నాం. ఆ సమయంలో మా రెండు ఫ్యామిలీలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత 2012 నుంచి కలిసి ఉన్నాం. కాగా 2014 లో మా నాన్న నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకున్నావని మన కుటుంబంలో ఎవ్వరికీ తెలీదు. అయితే మీరు జీవితంలో ముందు మంచిగా సెటిల్‌ అవ్వండి. మీ కాళ్ల మీద మీరు నిలబడండి. ఆ తర్వాతే నేనే పెళ్లి చేస్తా అని అన్నారు. మా నాన్న ఆ మాట అనడంతో నాకు చాలా ఆనందం వేసింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు నాకు ఆరోగ్యం బాలేదు. ఏమిటా అని ఆసుపత్రికి వెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పారు డాక్టర్స్. నేను ప్రెగ్నెంట్ అనే ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. నేను నా భర్త రెండు రోజులు ఆలోచించుకున్నాం. ఆ తరువాత కడుపు తీసేయించుకున్నాను. నా చేతులతోనే నా బేబీని చంపేసుకున్నా. ఆ తరువాత నేను ప్రెగ్నెంట్ కానేమో అని చాలా బాధేసి డిప్రెషన్‌లోకి వెళ్లాను. ఆ ఘటన తర్వాత 2017లో అందరినీ ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నాము. పెళ్లి అయినా ఐదు నెలల తరువాత మళ్లీ నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ ప్రెగ్నెన్సీ నిలవలేదు. మిస్ క్యారీ అయ్యింది. ఆ తర్వాత 2018లో నా కడుపులోకి జున్ను గాడు వచ్చాడు. వాడే నా జీవితంలో వెలుగులు నింపాడు. అంటూ భావోద్వేగం అయినా లాస్య.. అమ్మా నాన్న అప్పుడు మొదటి బేబీని తీసేసుకున్న విషయం మీకు తెలీదు. ఇప్పుడు చెబుతున్నాను.. క్షమించండంటూ కన్నీటిపర్యంతమైంది.

First published:

Tags: Anchor lasya, Bigg Boss 4 Telugu

ఉత్తమ కథలు