Bigg Boss Telugu 4 : కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ చేసిన నిర్వాహకులు..

తెలుగులో ఇప్పటి వరకు మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌.. నాల్గవ సీజన్‌కు సన్నాహాలను ప్రారంభించింది.

news18-telugu
Updated: July 1, 2020, 9:52 AM IST
Bigg Boss Telugu 4 : కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ చేసిన నిర్వాహకులు..
బిగ్ బాస్ 4 Photo : Star maa
  • Share this:
తెలుగులో బిగ్‌బాస్‌ ఇప్పటి వరకు మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షో తెలుగులో ఎంత ఆదరణ దక్కించుకుందంటే ఈ షో ధాటికి కొన్ని సినిమాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. అంతలా ఆకట్టుకుంది. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశాడు. ఇక మూడవ సీజన్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా లేకపోయింటే ఇప్పుటికే ఈ షో ప్రారంభమయ్యేది. గత మూడు సీజన్‌లను చూసినట్లయితే బిగ్ బాస్ షో మార్చి ఏప్రిల్‌ నుండే ఏర్పాట్లు ప్రారంభం అవ్వుతుండేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ షో ఉంటుందా అసలు ఉండదా అనే అనుమానాలు ఏర్పడిన నేపథ్యంలో షోను నిర్వహించడానికి మాటీవీ యాజామాన్యం సన్నాహాలు ప్రారంభించిందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సీజన్‌లో పాల్గొనే వారు కూడా కొంతమంది ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా హైపర్ ఆది, మంగ్లీ, తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష, నటుడు తాగుబోతు రమేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ షో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు నుండి ప్రారంభంకానుందని తెలుస్తోంది. మరోవైపు నాలుగో సీజన్‌‌కు కూడా నాగార్జున మరోసారి హోస్ట్‌గా చేసే అవకాశం మెండుగా ఉందని సమాచారం.
First published: July 1, 2020, 9:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading