Bigg Boss Telugu 4 : ఈ వారం మాస్టర్ అవుట్.. మోనాల్ కోసం మెహ‌బూబ్‌ బలి..

Bigg Boss Telugu 4 : బిగ్ బాస్ తెలుగు నాల్గవ సీజన్ ప్రస్తుతం తొమ్మిదవ వారం నడుస్తోంది. ఎనిమిదవ వారంలో అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ కావాల్సివుండగా..

news18-telugu
Updated: November 5, 2020, 2:08 PM IST
Bigg Boss Telugu 4 : ఈ వారం మాస్టర్ అవుట్.. మోనాల్ కోసం మెహ‌బూబ్‌ బలి..
బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)
  • Share this:
బిగ్ బాస్ తెలుగు నాల్గవ సీజన్ ప్రస్తుతం తొమ్మిదవ వారం నడుస్తోంది. ఎనిమిదవ వారంలో అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ కావాల్సివుండగా.. అనుకోకుండా నోయల్ అనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడంతో ఎవరు ఎలిమినేట్ కాలేదు. హౌజ్‌లో అమ్మా రాజశేఖర్ రచ్చను చూడలేక ఎలాగైనా బయటకు పంపించాలనీ చూసిన కూడ.. బిగ్ బాస్ రాజశేఖర్‌ను ఎలాగోలా కాపాడాడు. దీంతో గత వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్ళలేకపోయారు. ఇక ఈ వారం కూడా ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఇంట్లో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో అభిజీత్, హారిక, అమ్మ రాజశేఖర్, అవినాష్, మోనాల్‌లు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో అభిజిత్, హారిక, అవినాష్‌లు బలంగా ఉండడంలో సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఈ వారం వీరికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మిగిలిన ఇద్దరిలో అమ్మ రాజశేఖర్ మరోసారి డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఇక మోనాల్‌ను ఇప్పటికిప్పుడు బిగ్ బాస్ ఇంటి నుంచి పంపించే ఆలోచన చేయడని అంటున్నారు నెటిజన్స్. హౌజ్‌లో గ్లామర్ కంటెంట్ ఉండాలి కాబట్టి ఈమెను ఇప్పట్లో ఎలిమినేట్ చేయకపోవచ్చు అని అంటున్నారు.

bigg boss 4 telugu,bigg boss 4 telugu amma rajasekhar self elimination,bigg boss 4 telugu amma rajasekhar eliminated,bigg boss 4 telugu amma rajasekhar mehboob eliminated,bigg boss 4 telugu amma rajasekhar eliminated,telugu cinema,బిగ్ బాస్ 4 తెలుగు అమ్మ రాజశేఖర్ సెల్ఫ్ ఎలిమినేషన్,అమ్మ రాజశేఖర్,బిగ్ బాస్ 4 తెలుగు మెహబూబ్ అమ్మ రాజశేఖర్
అమ్మ రాజశేఖర్ మెహబూబ్

(amma rajasekhar mehboob)


ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈవారం ఇంటి నుంచి అమ్మా రాజశేఖర్ బయటికి వెళ్ళిపోవడం ఖాయం అని తెలుస్తోంది. ఇతనికి ఓట్లు అందరి కంటే తక్కువ వస్తున్నాయట. ఇక వచ్చేవారం బిగ్ బాస్ హౌస్ లోకి ఫోక్ సింగర్, తీన్మార్ యాంకర్ మంగ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది.

దీంట్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. ఇక ఈ వారం ఒక‌వేళ మాస్ట‌ర్ ఎలిమినేట్ అయితే అంద‌రి టార్గెట్‌ మోనాల్‌, మెహ‌బూబ్‌లే. అయితే మోనాల్‌ను బిగ్‌బాస్ వ‌దులుకోడానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. దీంతో ఆమె కోసం మెహ‌బూబ్‌పై వేటు వేయ‌డానికి వెన‌క‌డుగు వేయ‌కపోవచ్చని అంటున్నారు నెటిజన్స్.
Published by: Suresh Rachamalla
First published: November 5, 2020, 1:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading