బిగ్ బాస్ తెలుగు నాల్గవ సీజన్ పదోవారం చివరకి వచ్చింది. ఈ షోలో ప్రతివారం ఓ ఎలిమినేషన్ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికి బిగ్‌బాస్ హౌస్ నుంచి పది మంది కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. మొదటి వారం నుంచి వరుసగా.. సూర్యకిరణ్, కల్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్, సుజాత, కుమార్ సాయి, దివి, అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు. అనారోగ్య కారణాలతో గంగవ్వ, నోయల్ స్వయంగా బయటకు వచ్చారు. ఎప్పటిలాగే ఈరోజు హౌజ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారో తెలిసిపోయింది. అయితే అంతకంటే ముందు ఈ వారం అసలు నామినేషన్లో ఎవరు ఉన్నారో చూద్దాం.. అరియానా, అభిజీత్, మోనాల్, మెహబూబ్, హారిక ఉన్నారు. అయితే వీరిలో హౌజ్‌లో ఉన్న స్టాంగ్ కంటెస్టెంట్లో ఒకరుగా ఉన్న మెహబూబ్ ఈరోజు హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతున్నాడని తెలుస్తోంది. ఇది ముందు నుంచి ఊహించిందే. నిజానికి ఎప్పుడో బ్యాగు సర్దేయాల్సిన మెహబూబ్.. అదృష్టం బాగుండి తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు నామినేషన్లోకి వచ్చి అడ్డంగా బుక్కయ్యాడని అంటున్నారు. అయితే మిగితా వారితో పోల్చితే మెహబూబ్ మంచి ప్లేయరే.. ముఖ్యంగా ఫిజికల్ టాస్క్‌ల విషయంలో ఇరగదీస్తాడు. అయితే అదే ఆయనకు మైనస్‌గా మారిందని అంటున్నారు. రోబో టాస్కు నుంచి మెహబూబ్ ప్రవర్తన తీరుపై చాలా మందికి వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. అతడికి కండబలం ఉంది కానీ బుద్ధిబలం తక్కువ. కాయిన్ల టాస్కులో గెలిచే అవకాశాన్ని కొల్పోయాడు. ఇలా ఇవన్ని కలసి ఆయన ఎలిమినేషన్‌కు కారణమైయ్యాయని అంటున్నారు.
అయితే ఇక్కడ మరో విశేషమేమంటే.. మోనాల్‌ను తప్పించడానికి మెహబూబ్‌ను బలిచేశారా అని అంటున్నారు. ఆరవ వారంలో కుమార్ సాయి, మోనాల్‌లకు తక్కువ ఓట్లు రాగా.. ఈ ఇద్దరీలో ఖచ్చితంగా కుమార్ సాయి మెరుగైన ఆటగాడు కానీ.. అతన్ని బిగ్ బాస్ కావాలనే ఎలిమినేట్ చేశాడని.. కారణం ఒకవేళా మోనాల్ ఎలిమినేట్ అయితే హౌజ్‌లో గ్లామర్ కోషంట్ తగ్గుతుందనే కోణంలో అతన్ని అప్పుడు బలి చేశారని అంటున్నారు నెటిజన్స్.., ఇప్పుడు కూడా మరోసారి అదే రిపీట్ చేశారని అంటున్నారు. ఇక బిగ్ బాస్ మాత్రం ఓట్లు మాత్రమే ఇంటి సభ్యుల ఎలినిమేషన్ను నిర్ణయిస్తాయని అంటున్నాడు.
Published by:Suresh Rachamalla
First published:November 15, 2020, 08:38 IST