Home /News /movies /

BIGG BOSS TELUGU 4 STAR TELUGU STAR COMEDIAN TO ACT IN SOHEL MOVIE WITHOUT REMUNERATION HERE ARE THE DETAILS SR

Bigg Boss Telugu 4 : సోహెల్‌కు అండగా సీనియర్ స్టార్ కమెడియన్.. సాయం ఆ విధంగా..

సోహెల్ Photo : Twitter

సోహెల్ Photo : Twitter

Bigg Boss Telugu 4 : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మొన్నటి ఆదివారంతో ముగిసింది. గత మూడునెలలుగా సాగిన ఈ బిగ్‌ బాస్‌ సీజన్‌లో విన్నర్‌ గా అభిజిత్‌ నిలిచినా కూడా సోహెల్‌ అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

    తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మొన్నటి ఆదివారంతో ముగిసింది. గత మూడునెలలుగా సాగిన ఈ బిగ్‌ బాస్‌ సీజన్‌లో విన్నర్‌ గా అభిజిత్‌ నిలిచినా కూడా సోహెల్‌ అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. టాప్ త్రీలో ఒకరైన సోహైల్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సోహెల్ తన స్మార్ట్‌గేమ్‌తో రూ.25లక్షలు సొంతం చేసుకున్నాడు. ఈ నిర్ణయం అందరిని ఆకట్టుకుంది. అనాథ శరణాలయానికి రూ.10లక్షలు ఇస్తానంటే, ఆ మొత్తాన్ని తన వద్దే ఉంచుకోమని అందుకు తాను ఇస్తానని నాగార్జున ప్రకటించాడు. ఇక షోకు అతిథిగా వచ్చిన చిరంజీవి కూడా సోహైల్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేకాదు, సోహైల్‌ ఊతపదం ‘కథ వేరే ఉంటుంది’ తన సినిమాలో మేనరిజమ్‌గా పెట్టుకుంటానని అడిగడం ఎంతో నచ్చింది. ఇక మరో బంపర్ ఏమంటే.. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు, ఆ చిత్రంలో చిన్న పాత్రలో నటిస్తానని చిరంజీవి అనడంతో సోహెల్ ఆనందంలో మునిగిపోయాడు. చిరంజీవి వంటి స్టార్‌ అలాంటీ హామీ ఇవ్వడంతో సోహెల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిరంజీవి మాట్లాడిన మాటలు ఇండస్ట్రీతో పాటు ప్రతి ఒక్కరికి కూడా హార్ట్‌ టచ్చింగ్‌ అయ్యాయి. చిరంజీవి సోహెల్ కోసం స్వయంగా సురేఖ గారితో వండించుకుని మరీ బిర్యానీ తీసుకు వచ్చాడు. ఇలా సోహెల్ స్టార్ ఆఫ్ ది షోగా నిలిచాడు.

    ఇది ఇలా ఉంటే ప్రముఖ టాలీవుడ్ కమెడీయన్ బ్రహ్మానందం కూడా సోహెల్ చేసే సినిమాలో రూపాయి తీసుకోకుండా నటిస్తానని తెలిపాడట. దీనిపై కొంత క్లారిటీ రావాల్సీవుంది. అయితే ఒకవేళా కనుక అది నిజమైతే సోహెల్ లక్కి ఛాన్స్ కొట్టినట్లే. ఓ వైపు చిరంజీవి, నాగార్జున అండ, మరోవైపు బ్రహ్మానందం వంటి స్టార్ కమెడీయన్ కూడా సోహెల్‌కు తోడుగా తన సినిమాలో నటిస్తాననడం సూపర్ అంటున్నారు నెటిజన్స్. ఇలా ఓ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు నెటిజన్స్.

    ఇక సోహెల్‌తో పాటు మొన్న జరిగిన ఫినాలే షోలో దివికి మంచి అవకాశం ఇచ్చాడు చిరంజీవి. మెహర్‌ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేస్తోన్న ‘వేదాళం’ రీమేక్‌లో ఓ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను ఇవ్వనున్నట్లు తెలిపాడు మెగాస్టార్. కేవలం ఈ ఒక్క పాత్రే కాకుండా భవిష్యత్‌లో మంచి పాత్రలు ఇవ్వాలని దర్శకులకు సూచిస్తానని చిరంజీవి తెలపడంతో దివి నక్కతోక్కినట్లైంది. మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్‌కు కూడా చిరు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చాడు. ఫినాలే సందర్భంగా సోహైల్‌ తనకు వచ్చిన 25లక్షల్లో ఓ 5లక్షలు మెహబూబ్‌కు ఇవ్వగా, అతను తిరిగి దాన్ని అనాథ శరణాలయానికి ఇవ్వగా.. ఈ విషయం తెలిసిన చిరంజీవి వేదికపైనే 10లక్షల చెక్‌ను మెహబూబ్‌కు అందించి మంచి మనసు చాటుకున్నాడు చిరంజీవి.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bigg Boss 4 Telugu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు