news18-telugu
Updated: December 2, 2020, 7:07 PM IST
బిగ్‌బాస్ (Star Maa/Photo)
Bigg Boss 4 Telugu | తెలుగు సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో బిగ్‌బాస్ షో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో 13 వారాలు పూర్తి చేసుకుంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి అవినాష్ బిగ్‌బాస్ హౌస్‌లో సేఫ్ అయిపోయాడు. ఇంకా ఎక్కువలో ఎక్కువగా మరో నాలుగు వారాల్లో బిగ్‌బాస్ షోకు శుభం కార్డు పడనుంది. ఇప్పటికే మూడు సీజన్స్‌లో మేల్ కంటెస్టెంట్స్ మాత్రమే విజేతలుగా నిలిచారు. కాబట్టి.. ఈ సారి బిగ్‌బాస్ 4 విజేతగా ఫీమేల్ కంటెస్టెంట్‌కు వచ్చే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోందిలేకపోతే.. బిగ్‌బాస్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంట్లో టీవీ చూసుకునే వాడు. అంతా సాఫీగా సాగుతున్న బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ అనే సరికి కంటెస్టెంట్స్ ఒకరికొకరు శత్రువులుగా మారి బురద జల్లుకోవడం కామన్ అయిపోయింది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరూ ఊహించని విధంగా హారిక వెళ్లి అభిజీత్‌ను నామినేట్ చేయడం కొసమెరుపు. మొన్న టాస్కులో పర్ఫార్మెన్స్ చేయనందుకు ఆమె నామినేట్ చేసింది. అయితే తిరిగి అభి కూడా హారికకు సమాధానమిచ్చాడు. ఇదిలా ఉంటే అవినాష్, అఖిల్ మధ్య కూడా చర్చ వేడిగానే జరిగింది. తనకంటే వీక్ అనుకున్న వాళ్లు ఇంట్లో ఉన్నపుడు తానెందుకు ఎలిమినేట్ కావాలంటూ అవినాష్ ప్రశ్న వేసాడు.
ఈ సంగతి పక్కనపెడితే.. అభిజిత్.. హౌస్‌లో సేవ్ కావడానికి బయట పెద్ద పీఆర్ టీమ్ పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫైనల్‌కు దగ్గర పడగానే.. హౌస్‌లో మళ్లీ ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఈ లెవల్లో అభిజిత్, హారిక, అఖిల్, సొహెల్ సెకండ్ లెవల్ గ్రాండ్ ఫినాలేకు క్వాలిఫై అయ్యారు. ఈ సెకండ్ లెవల్లో బిగ్‌బాస్ హౌస్ మేట్స్‌కు పూలతో ఫ్లవర్ టాస్క్ ఇచ్చాడు. అందరు ఈ టాస్క్‌లో పార్టిసిపేట చేసారు.
బిగ్‌బాస్ నిర్వాహకులు రిపోర్ట్స్ ప్రకారం అభిజిత్, హారిక ఫ్లవర్ టాస్క్‌లో ఓడిపోయినట్టు సమాచారం. అఖిల్, సొహైల్ మాత్రం థర్డ్ లెవల్లో టాటూ టాస్క్‌లో క్వాలిఫై అయ్యారు. ఈ టాస్క్‌లో విజయం సాధించినా.. ఫైనల్‌గా ఎవరు గ్రాండ్ ఫినాలే లో ఉంటారనేది చూడాలి. ఇప్పటి వరకు సోహైల్, అఖిల్ మాత్రం గ్రాండ్ ఫినాలేలో చోటు సంపాదించుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి బిగ్‌బాస్ ఫైనల్ విజేతగా అఖిల్ నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐనా..చివర వరకు ఎవరు నిలస్తారనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 2, 2020, 7:07 PM IST