news18-telugu
Updated: November 6, 2020, 2:04 PM IST
కుమార్ సాయి Photo : Star Maa
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కరోనా కారణంగా ఈ సారి కొంత లేటుగా ప్రారంభం అయినా సంగతి తెలిసిందే. దీన్నే బిగ్ బాస్ యాజమాన్యం కొంత తెలివిగా వాడుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్లో విషయంలో నిర్వాహకులు చాలా పొదుపుగా ఆలోచించినట్లు అర్ధమవుతోంది. ఇప్పటివరకు ప్రసారం అయినా సీజన్స్‌లో చాలా వరకు తెలిసిన మొఖాలు ఉండేవి. దీంతో వారు బిగ్ బాస్ రియాలిటీషో పాల్గొనాలంటే ఖచ్చితంగా భారీగానే రెమ్యూనరేషన్ ఇవ్వాల్సివచ్చేది. కానీ ఈ సారి మాత్రం దాదాపు అందరూ కొత్త వాళ్లే.. ఒక్క లాస్య, దేవి నాగవల్లి తప్ప. బిగ్ బాస్ యాజమాన్యం ప్రతి సీజన్‌కు తెలిసిన వారినే హౌజ్‌లోకి పంపేవారు. అయితే ఈ సారి మాత్రం కాస్త లో ప్రొఫైల్ కంటెస్టెంట్స్ ని రంగంలోకి దింపారు. అయితే ఇక్కడ రెండు విషయాలు.. ఒకటి కరోనా కారణంగా పెద్ద యాక్టర్స్ బహుశా ఈ షోలో పాల్గోనడానికి ఇష్టం చూపించకపోవచ్చు. దీనికి అనేక కారణాలు. ఇక రెండోది.. కరోనా కష్ట కాలంలో జనాలు టీవీలకు బాగా అలవాటు పడ్డారని ఎవరిని తెచ్చినా చూస్తారని అనుకున్నట్లుగా బిగ్ బాస్ యాజమాన్యం ప్లాన్ చేసి ఉండవచ్చు. చెప్పాలంటే ఈ సారి బిగ్ బాస్ షోను తక్కువ ఖర్చుతోనే కానిచ్చేశారు. ఇక ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్పై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కూమార్ సాయి హౌజ్ నుండి ఎలిమినేట్ అయినా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అనేక ఛానల్స్‌కు ఇంటర్వూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో కుమార్ సాయి తన రెమ్యునరేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఒక వివరణ ఇచ్చాడు.

కుమార్ సాయి Photo : Star Maa
ఈ షోలో కుమార్ సాయి పాల్గొన్నందుకు ఆయనకు దక్కిన రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ తింటారు. అయితే ప్రతి కంటెస్టెంట్ రెమ్యూనరేషన్ విషయంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక కుమార్ సాయి తన రెమ్యూనరేషన్ గురించి వివరణ ఇస్తూ.. తాను రెమ్యునరేషన్ గురించి ఎప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదని.. ఎంతో కొంత తీసుకునేవాన్ని.. అదే విధంగా బిగ్ బాస్ లో తనకు రెగ్యులర్ గా సినిమాలకు ఎంత ఇస్తారో.. అంతే మొత్తం ఇచ్చారని లక్షలు లక్షలు ఏమి ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చాడు సాయి. దీంతో కుమార్ సాయి రెగ్యులర్‌గా సినిమాల్లో నటించడానికి 10వేల లోపు డైలీ పేమెంట్ అందుకోవచ్చని అంటున్నారు. దీన్ని బట్టి కుమార్ సాయికి బిగ్ బాస్ లో ఉన్న అన్ని రోజులు 25-35 వేల వరకు డైలీ పేమెంట్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు నెటిజన్స్.
Published by:
Suresh Rachamalla
First published:
November 6, 2020, 2:02 PM IST