Bigg Boss Telugu 4 : అభిజీత్ సూచనలతో.. మోనాల్‌తో రొమాన్స్ చేసిన అఖిల్..

Bigg Boss Telugu 4 : బిగ్ బాస్ సీజన్ 4 ఏడో వారం పూర్తి చేసుకోబోతుంది. ఈ షో నుంచి ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు.

news18-telugu
Updated: October 24, 2020, 11:03 AM IST
Bigg Boss Telugu 4 : అభిజీత్ సూచనలతో.. మోనాల్‌తో రొమాన్స్ చేసిన అఖిల్..
అఖిల్, మోనాల్ Photo : Star maa
  • Share this:
బిగ్ బాస్ సీజన్ 4 ఏడో వారం పూర్తి చేసుకోబోతుంది. ఈ షో నుంచి ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. గంగవ్వ ఆరోగ్యం సరిగాలేక ఇంటి నుంచి స్వయంగా బయటకువచ్చింది. ఇక మొదటి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సూర్య కిరణ్‌ ఎలిమినేట్ అవ్వగా.. రెండవ వారం కరాటే కళ్యాణి, మూడవ వారం దేవి నాగవల్లి, నాల్గవ వారం స్వాతి దీక్షిత్‌, ఐదవ వారం జోర్దార్ సుజాత, ఆరవ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కుమార్ సాయి ఎలినేట్ అయ్యాడు. ఇక ఈ వారం అరియానా, అవినాష్‌, దివి, మోనాల్‌, నోయల్ అభిజిత్‌లు నామినేషన్‌లో ఉండగా.. డేంజర్ జోన్‌లో నోయల్, దివి ఉన్నట్లు సమాచారం. అది అలా ఉంటే శుక్రవారం ఎపిసోడ్‌లో ఓ గమ్మత్తు జరిగింది. అదేంటంటే.. బిగ్‌బాస్‌ 4లో అడుగుపెట్టిన కొత్తలో కాస్త బాగానే ఉన్నప్పటికీ.. రాను రాను అభిజిత్‌, అఖిల్‌ల మధ్య విబేధాలు మొదలయ్యాయి. దీనికి కారణాలు చాలా ఉన్న.. ముఖ్యంగా మోనాల్‌ విషయంలో ఈ ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతూనే ఉంది. కారణం అందాల ముద్దుగుమ్మ మోనాల్‌ని ఈ ఇద్దరు ఇష్టపడడం. దీంతో తెలీకుండానే వీరి మధ్య గొడవకు, భిన్న అభిప్రాయాలకు కారణమైంది. ఇక మోనాల్‌ విషయంలోనే నామినేషన్ల సమయంలో వీరిద్దరు ఎలాంటి కారణాలు లేకుండానే ఒకరినొకరు నామినేట్ చేసుకునే వారు. కాగా తాజా ఎపిసోడ్‌లో దానికి రివర్స్ జరిగింది. అభిజీత్‌ను అఖిల్ సపోర్ట్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ఓ సినిమాను తీయాల్సి ఉంది. దీంతో డైలాగుల విషయంలో స్క్రిప్ట్‌ రైటర్‌ అవినాష్‌కు, దర్శకుడు అభిజీత్‌కి బేధాభిప్రాయాలు వ‌చ్చాయి.

ఆ సమయంలో కమెడియన్ అవినాష్‌ అభిజీత్ పట్ల అసహనం, విసుగు చూపించాడు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అఖిల్, అభిజీత్‌కు స‌పోర్ట్‌గా నిలిచాడు. ఎప్పుడూ గొడవపడే ఈ ఇద్దరూ ఒకరికి ఒకరు ఇలా సపోర్ట్‌గా నిలవడం కొత్తగా అనిపించింది. చూసే వారిని మాత్రం ఈ సీన్ చాలా ఆకట్టుకుంది. ఇక్కడ కొసమెరుపు ఏమంటే ఈ సినిమాకు డైరెక్టర్‌గా చేస్తోన్న అభిజీత్.. మోనాల్‌, అఖిల్‌పై రొమాంటిక్ సీన్‌ని డైరెక్ట్ చేయడం ఈ ఎపిసోడ్‌కి హైలెట్‌గా నిలిచింది. ఇక ఈరోజు, రేపు బిగ్ బాస్ షోను నాగార్జున కాకుండా సమంత హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కారణం నాగార్జున ఓ ఇరవై రోజుల షూట్ కోసం మనాలీ వెళ్లాడు. నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌ను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హిమాలయాల్లో జరుగుతోంది. దీంతో ఈ రోజు రేపు బిగ్ బాస్ షోలో ఆయన కోడలు సమంత సందడి చేయనుందని తెలుస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: October 24, 2020, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading