Bigg Boss Telugu 4: బస్తీ మే సవాల్.. బిగ్ బాస్ క్షమాపణ చెప్పాలి.. : నోయల్..

Telugu Bigg Boss Season 4: ఇంటి సభ్యులు తెలుగు మాట్లాడటంలేదని బిగ్‌బాస్ అందరికీ కలిపి పనిష్మెంట్ ఇచ్చాడు. ఈ విషయంలో నోయల్ కొంత సీరియస్ అయ్యినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 18, 2020, 11:08 PM IST
Bigg Boss Telugu 4: బస్తీ మే సవాల్.. బిగ్ బాస్ క్షమాపణ చెప్పాలి.. : నోయల్..
బిగ్ బాస్ తెలుగు 4 లోగో Photo : Twitter
  • Share this:
Big Boss Telugu 4 : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్స్‌ను పూర్తిచేసుకున్న ఈ షో నాల్గవ సీజన్‌లో మొదటి వారంను విజయవంతంగా పూర్తిచేసుకుంది. మొదటి వారం ఎలిమినేషన్‌లో భాగంగా సూర్య కిరణ్ బయటకు వచ్చేశాడు. ప్రస్తుత సీజన్’కు కూడా నాగార్జున అక్కినేని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నాలుగో సీజన్ ఈ సారి కొంత లేటైనా ఇప్పుడే అసలైన ఎంటర్ టైన్మెంట్ మొదలైంది.  అందులో భాగంగా షో ప్రారంభ‌మైన వారం రోజులకే బిగ్‌బాస్ నిర్వాహ‌కులు వైల్డ్ కార్డ్ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు. అందులో భాగంగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా “ఈరోజుల్లో” బస్టాప్ ఫేమ్ సాయి కుమార్ హౌజ్’లోకి వచ్చాడు. ఆ తర్వాత మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ముక్కు అవినాష్ వచ్చాడు. దీంతో మొదటి వారంలో నీరసంగా సాగిన షో రెండోవారంలోకి వచ్చేసరికి పూర్తి వినోదాత్మకంగా మారింది. ఓ ప్రేమకథ కూడా స్టార్ట్ అయ్యింది. అభిజిత్, అఖిల్, మునాల్..ల ముక్కోణపు ప్రేమకథ ఆసక్తి కరంగా సాగుతోంది.

ఇక మరో ఇంట్రేస్టింగ్ అంశం ఏమంటే.. ఈ వారం ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. హౌస్ లో మొత్తం 16 మంది ఉండగా.. మొదటి వారంలో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఆయన స్థానంలో సాయి కుమార్ వచ్చేశాడు. ఆ తర్వాత జబర్దాస్త్ అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ వారం ఇద్దరు బయటకు వెళతారని సమాచారం. అందులో ఒకరు కరాటే కల్యాణి అని తెలుస్తోంది. అంతేకాదు ఆమె ఎలిమినేషన్ దాదాపుగా ఖారారైందట. ఆమెతో పాటు మరోకరు కూడా బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే అది గంగవ్వే కావచ్చనేది టాక్. కారణం ఆమెకు అక్కడి వాతావరణం పెద్దగా నచ్చట్లేదట. దీంతో బయటకు వెళ్ళిపోవాలని కోరుకుంటోందట గంగవ్వ.



అందరికి ఫేవరేట్ కంటెస్టెంట్ అయిన గంగవ్వ తన ఇంటికి వెళ్లిపోతానని చెప్పింది. దీంతో బిగ్‌బాస్ అభిమానులు ఆమె ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. ఇక అది అలా ఉంటే ఇంటి సభ్యులు తెలుగు మాట్లాడటంలేదని బిగ్‌బాస్ అందరికీ కలిపి పనిష్మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలో నోయల్ కాస్త నొచ్చుకున్నట్టు కనిపిస్తోంది. దీనికి సంబందించిన ప్రోమో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఈ విషయంలో నోయల్ మిగతా ఇంటి సభ్యులను కసురుకుంటూనే బిగ్‌బాస్ మీద కూడా చిర్రుబుర్రులాడుతున్నాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. నోయల్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా ఈ శనివారం ఇంట్లోంచి వెళ్లిపోతానని నిర్ణయించుకున్నానని తెలిపాడు నోయల్. నాగార్జునను ఎలాగైనా ఒప్పించి ఇంటి నుంచి వెళ్లిపోతానని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. అయితే మరి బిగ్‌బాస్ హౌజ్ నుండి నోయల్ వెళ్తాడా లేదా అనేది ఈ శనివారం తెలుస్తుంది.
Published by: Suresh Rachamalla
First published: September 18, 2020, 11:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading