news18-telugu
Updated: November 8, 2020, 7:55 AM IST
బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)
బిగ్ బాస్ తెలుగు 4 చాలా రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం తొమ్మిదో వారం చివరకు వచ్చింది. ఈ వారం ఎలిమినేషన్స్‌లో అభిజిత్, హారిక, మోనాల్, అమ్మ రాజశేఖర్, అవినాష్ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో అభిజీత్, హారిక, అవినాష్, మరోసారి మోనాల్ సేవ్ అవ్వగా.. అమ్మా రాజశేఖర్ ఇంటి నుంచి వెళ్లనున్నాడు అని తెలుస్తోంది. ఈ తొమ్మిది వారంలో అమ్మ రాజశేఖర్, మోనాల్ డేంజర్ జోన్లో ఉండగా... అందరి కంటే తక్కువ ఓట్లు అమ్మ రాజశేఖర్‌కి వచ్చాయి. దీంతో ఆయన ఇంటి నుంచి వెళ్లనున్నాడు. గత వారం ఎలిమినేషన్ లో మెహబూబ్, రాజశేఖర్ చివరి వరకు మిగిలారు. ఈ క్రమంలో మెహబూబ్ ని సేవ్ చేసిన బిగ్ బాస్, అమ్మ రాజశేఖర్ ఎలిమినేటైనట్లు ప్రకటించి.. ఆ తర్వాత నోయల్ కోరిక మేరకు ఈ వారం ఎలిమినేషన్ లేదని తెలిపారు. అయితే ఈ వారం మాత్రం అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ అయ్యాడని అంటున్నారు. ఇక మొన్నటి టాస్క్ 'రింగులో రంగు' లో తనపై రంగు పడకుండా తప్పించుకున్న అమ్మ రాజశేఖర్ కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయ్యాడో లేదో.. ఇక తన ప్రతాపాన్ని చూపడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా తన టీమ్ అయినా అవినాష్‌ని రేషన్ మేనేజర్‌గా, అరియానాను తన అసిస్టెంటుగా నియమించుకున్నాడు.

అమ్మా రాజశేఖర్ Photo : Star Maa
అయితే మామూలుగానే మాస్టర్‌ను ఆపడం కష్టం.. ఇక ఇంటి కెప్టెన్ అవ్వడంతో తన లోని ఫ్రస్టేషన్ అంతా బయటకు తీస్తున్నాడు. ఆయన కెప్టెన్ అవ్వడంతో ఆయనకు పడని అభిజిత్, అఖిల్, హారికలకు చుక్కులు చూపిస్తున్నాడు. అందులో భాగంగా పనులను పంచే విషయంలో పక్షపాతం చూపించాడు. తనకు అనుకూలంగా ఉండే అవినాష్, మోహబూబ్ లకు చిన్న పనులు ఇచ్చాడు. ఇక అరియానాకు అసలు ఏం పని లేకుండా తన అసిస్టెంట్‌గా ఉండమన్నాడు. ఇలా ఆయన ఇష్టమొచ్చినట్లు చేయడంతో బయట రాజశేఖర్ మీద చాలా వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు తక్కువుగా ఓట్లు రావడంతో రాజశేఖర్ ఎలిమినేషన్ ఇక లాంచనమే అంటున్నారు.
Published by:
Suresh Rachamalla
First published:
November 8, 2020, 7:55 AM IST