news18-telugu
Updated: November 25, 2020, 11:38 AM IST
బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)
తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా రన్ అవుతూ మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా లాస్య ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మరో రకంగా అంటున్నారు. మోనాల్ వెళ్లాల్సిన స్ధానంలో లాస్య వెళ్లిందని అంటున్నారు. అయితే లాస్య ఎలిమినేట్ అవ్వుద్దని ఓ రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బిగ్ బాస్ యూనిట్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాదు ఇంకోసారి ఇలా జరిగితే ఇకపై హోస్టింగ్ చేయనని వార్నింగ్ కూడా ఇచ్చాడట. అసలు విసయంలోకి వస్తే.. తెలుగు బిగ్ బాస్ అంటేనే ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయని అనుకుంటారు.. వాటిని ఊహిస్తారు కూడా. అందులో భాగంగా ఫైనల్స్ వరకు ఉంటారనుకున్న కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడం, మిడ్ వీకెండ్ ఎలిమినేషన్ సహా ఎన్నో సరికొత్త ప్రయోగాలతో అలరిస్తూ ఉంటుంది బిగ్ బాస్ షో. అందుకే ఈ షోలో జరిగే ప్రతి విషయం ఎంతో రహస్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు బిగ్ బాస్ నిర్వహకులు. కానీ, నాలుగో సీజన్లో బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరిగినా ఒకరోజు ముందుగానే లీకైపోతుంది. అందులో భాగంగా మొదటినుంచి అందరి ఎలిమినేషన్‌కు సంబందించి ముందే లీక్స్ వస్తున్నాయి. ఆ లీక్స్ ఏ మాత్రం తప్పుకాకుండా నిజం అవుతున్నాయి. దీంతో షోపై ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ యూనిట్‌పై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని టాక్. ఇది కూడా చదవండి..
మేము పంది మాంసం తింటాం: రష్మిక మందన..
ఈ విషయంలో కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ముందే లీక్స్ కావడంపై నాగార్జున కొంత సీరియస్ అయ్యినట్లు సమాచారం. ఇలా ఇదే కంటిన్యూ అయితే హోస్టింగ్ చేయనని బిగ్ బాస్ యూనిట్‌కు వార్నింగ్ ఇచ్చాడట నాగార్జున. మరీ ముఖ్యంగా ప్రతి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు ముందే బయటకు వస్తే షో ఎవరు చూస్తారని ఆయన నిర్వహకులపై ఫైర్ అయ్యాడట. దీంతో ఇంకోసారి అలా రిపీట్ కాకుండా చూసుకుంటామని టీమ్ హామి ఇచ్చిందట. చూడాలి మరి ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ ఏమాత్రం జాగ్రత్తలు తీసుకుంటుందో.. ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మొన్నటి వరకు మనాలీలో షూటింగ్ జరుపుకుని హైదరాబాద్ వచ్చింది. ఈ సినిమాతో పాటు నాగార్జున ఓ హిందీ సినిమా కూడా చేస్తున్నాడు.
Published by:
Suresh Rachamalla
First published:
November 25, 2020, 11:31 AM IST