Bigg Boss Telugu 4 : బిగ్ బాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

Bigg Boss Telugu 4 : ఇప్పటికే మూడు సీజన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. నాల్గవ సీజన్ కోసం టీవీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

news18-telugu
Updated: August 12, 2020, 11:16 AM IST
Bigg Boss Telugu 4 : బిగ్ బాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..
బిగ్ బాస్ తెలుగు 4 లోగో Photo : star maa
  • Share this:
ఇప్పటికే మూడు సీజన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. నాల్గవ సీజన్ కోసం టీవీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. సీజన్ 2 నాని హోస్ట్ చేశాడు. ఇక మూడవ సీజన్‌ను అక్కినేని నాగార్జున తన మాటలతో, ఆటలతో అదరగొట్టించాడు. ఇక తాజాగా వస్తోన్న ఈ సీజన్ 4 కి కూడా మళ్ళీ నాగార్జునని తీసుకుంది బిగ్ బాస్ యాజమాన్యం. దీనికి సంబందించి ఓ ప్రోమో కూడా విడుదల చేసింది బిగ్ బాస్ టీమ్. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరున బిగ్ బాస్ సీజన్ 4 మొదలుకానుంది. నాగార్జున ఇప్పటికే ప్రోమో షూట్ చేసాడు. అయితే గంపెడు ఆశతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ అభిమానులు ఇంకొంత సమయం వెయిట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. కారణం కరోనా వైరస్ కారణంగా ఈ సీజన్ 4 భారీ మార్పులతో రాబోతోంది. దీంతో బిగ్ బాస్ సెట్ లో ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయట. దీనికి తోడు కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసిన తర్వాత.. 14 రోజులు వారు హోమ్ క్వారంటైన్ ఉండాలి. అన్ని టెస్ట్‌లు చేయించుకుని నెగటివ్ అని రావాలి.. ఇలా ఇవన్నీ చెయ్యడానికి కాస్త సమయం పడుతున్న నేపథ్యంలో ఈ షో అనుకున్న సమయానికి ప్రసారం కాకపోవచ్చనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో.. కొద్దీ రోజులు ఈ సీజన్ ని వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ షో లో పాల్గొనబోయే కంట్రస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అవడము లీకవడము జరిగింది. ఈ ప్రత్యేక సీజన్ కోసం ఓ 30 మందిని ఫైనల్ చేసి అందులో 15 మందిని హౌస్ లోకి పంపే ఏర్పాట్లు చేస్తోందట బిగ్ బాస్ టీమ్.

వారిలో ముఖ్యంగా టాలీవుడ్ హాట్ యాంకర్స్ విష్ణుప్రియ, మంజూషలతో పాటు నందు, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష కొరియోగ్రాఫర్ రఘు, మంగ్లీ, నోయల్, ప్రియా వడ్లమాని పేర్లు కూడా వినబడుతున్నాయి. చూడాలి మరి ఈ లిస్ట్‌లో ఎంతమంది బిగ్ బాస్ హౌజ్‌లో ఉండనున్నారో.
Published by: Suresh Rachamalla
First published: August 12, 2020, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading