Bigg Boss Telugu 4 : 30 నుంచి స్టార్ట్.. 100 ఎపిసోడ్స్.. 15 మంది సభ్యులు.. ఫుల్ లిస్ట్ ఇదే..

Bigg Boss Telugu 4 : తెలుగులో బిగ్‌బాస్‌ ఇప్పటి వరకు మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని నాల్గవ సీజన్‌కు రెడీ అవుతోంది.

news18-telugu
Updated: August 5, 2020, 11:50 AM IST
Bigg Boss Telugu 4 :  30 నుంచి స్టార్ట్.. 100 ఎపిసోడ్స్.. 15 మంది సభ్యులు.. ఫుల్ లిస్ట్ ఇదే..
బిగ్ బాస్ తెలుగు 4 లోగో Photo : star maa
  • Share this:
తెలుగులో బిగ్‌బాస్‌ ఇప్పటి వరకు మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని నాల్గవ సీజన్‌కు రెడీ అవుతోంది. పోయిన సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయ్యగా.. అంతకు ముందు నాని, ఎన్టీఆర్‌లు తమ యాంకరింగ్‌తో సందడి చేశారు. అయితే కరోనా లేకపోయింటే ఇప్పుటికే ఈ షోకు ప్రారంభమయ్యి ఉండేది. ఆ హాడావిడి జరుగుతుండేది. గత మూడు సీజన్‌లను చూసినట్లయితే బిగ్ బాస్ షో మార్చి ఏప్రిల్‌ నుండే ఏర్పాట్లు ప్రారంభం అవ్వుతుండేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ షో ఉంటుందా అసలు ఉండదా అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో... సీజన్ 4పై ఓ క్లారిటీ వచ్చేసింది. తాజాగా లోగో ప్రోమోని విడుదల చేసిన స్టార్ మా.. షో ఉంటుందనేలా క్లారిటీ ఇచ్చేసింది. ఇక తాజా సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు. అందులో భాగంగా ఆయన ఈ షోకి రెడీ అవుతున్నట్లుగా కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

ఇక ఈ షో గురించి తాజా అప్ డేట్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4 ఆగస్ట్ 30న ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్‌4కి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాగా.. షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్న నాగార్జునపై పలు ప్రోమోస్ షూట్ చేస్తోంది టీమ్. అయితే ఈ కరోనా వలన బిగ్ బాస్ సీజన్ 4..కేవలం 50 రోజులు మాత్రమే ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ కూడా సెంచరీ కొడుతుందని తాజా సమాచారం. ఇక ఈ షో స్టార్‌మాతో పాటు హాట్ స్టార్‌లలో ప్రసారం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ షో కోసం పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండింగ్ సంస్థలు క్యూ కడుతున్నాయట. ఈ తాజా సీజన్’లో 15 మంది సెలబ్రిటీలు ఉంటారనీ.. 15 వారాలు సాగుతూ.. దాదాపు 100కు పైగా ఎపిసోడ్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. కరోనా కారణంగా షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌ని మాత్రం అన్ని రకాల టెస్ట్‌లు చేసి మాత్రమే బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపుతారట.

ఇక ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్‌ని కూడా అల్రెడీ సెలక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హాట్ యాంకర్స్ విష్ణుప్రియ, మంజూషలు పాటు నందు, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష కొరియోగ్రాఫర్ రఘు, మంగ్లీ, నోయల్, ప్రియా వడ్లమాని పేర్లు కూడా వినబడుతున్నాయి.
Published by: Suresh Rachamalla
First published: August 5, 2020, 11:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading