• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS TELUGU 4 LATEST EPISODE LASYA AND HARIKA REVEALS SHOCKING FACTS SR

Bigg Boss Telugu 4 : బిగ్ బాస్ వేదికగా మరోసారి షాకింగ్ నిజాలను బయటపెట్టిన లాస్య హారిక..

Bigg Boss Telugu 4 : బిగ్ బాస్ వేదికగా మరోసారి షాకింగ్ నిజాలను బయటపెట్టిన లాస్య హారిక..

లాస్య, హారిక Photo : Instagram

Bigg Boss Telugu 4 : బిగ్ బాస్ ప్రస్తుతం పదవ వారం నడుస్తోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్’లో బిగ్ బాస్ ఇంటిసభ్యులకు ఆప్తుల నుంచి లెటర్స్ పంపించి ఎమోషనల్‌కి గురి చేశాడు. 

  • Share this:
    బిగ్ బాస్ సీజన్ ఫోర్‌లో ప్రస్తుతం తొమ్మిది మంది మాత్రమే కంటెస్టెంట్లుగా హౌజ్ లో మిగిలారు. ప్రస్తుతం పదవ వారం నడుస్తోంది. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే ఇక మిగిలేది ఎనిమిది మందే. అది అలా ఉంటే 67వ రోజు ఇంటిసభ్యులకు ఆప్తుల నుంచి లెటర్స్ పంపించి ఎమోషనల్‌కి గురి చేశాడు బిగ్ బాస్.  బిగ్ బాస్ దీపావళి సందర్బంగా ఇంటి నుండి కుటుంబ సభ్యులు రాసిన ఉత్తరాలను కంటెస్టెంట్స్ కు బహుమానంగా ఇచ్చేందుకు ఒక టాస్క్‌ను నిర్వహించాడు. ఆ టాస్క్ లో భాగంగా జీవితంలో అతి పెద్ద రహస్యం ఇప్పటి వరకు ఎవరితో షేర్ చేసుకోనటువంటి రహస్యంను చెప్పాలి. అప్పుడే వారికి ఆ లెటర్స్ అందుతాయి. అయితే వారు చెప్పే సీక్రెట్స్ నిజమేనా.. వారు చెప్పే సీక్రెట్స్ ఆకట్టుకుంటే అఖిల్ వారికి లెటర్ పంపించాల్సి ఉంటుంది. దీంతో అందరికి లెటర్స్ పంపిన అఖిల్.. అవినాష్ మరియు అరియానాలకు పంపలేదు. అవినాష్, అరియానా సీక్రెట్‌లకు సంతృప్తి చెందని అఖిల్.. ఆ ఇద్దరికి లెటర్స్ పంపించకుండా చించిన ముక్కల్నీ పంపించాడు.

    Bigg Boss Telugu 4  news, lasya and harika reveals shocking facts ,bhijeeth warns dethadi harika ,divi is eliminated from bigg boss seventh week, Dethadi harika , mangli, mangli in bigg boss telugu 4,amma rajashekar, amma rajashekar wife comments, bigg boss 4 details telugu, bigg boss 4 telugu latest, మంగ్లీ, బిగ్ బాస్ 4 తెలుగు, యాంకర్ లాస్య,
    అఖిల్ Photo : Star Maa


    ఇంటి సభ్యులు చెప్పిన రహస్యాల విషయానికి వస్తే.. దేతడి హారిక నాలుగున్నర ఏళ్ల పాటు రిలేషన్ లో ఉంటూ..ఈ విషయం ఎవరికి చెప్పకుండా రెండు సంవత్సరాల క్రితం బ్రేకప్ అయ్యిందని చెప్పింది. అభిజీత్ ఓ సారి అమెరికాకు వెళ్లిన కొత్తలో పొరపాటున మామూలు రెస్టారెంట్ అనుకుని గే రెస్టారెంట్ కు వెళ్లాడట. సోహెల్ మందు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి కౌన్సిలింగ్ కు వెళ్లాడట. ఈ సందర్భంగా ఆయన డూప్లీకేట్ పేరెంట్స్‌ను తీసుకెళ్లాడట. ఇక లాస్య తన జీవితంలో ఊహించని నిజాలను బయట పెట్టి మరోసారి అందరికీ షాక్ ఇచ్చింది. తన భర్త మంజునాద్ తనకంటే ఒక ఏడాది చిన్న అనే విషయం చెప్పింది. అంతేకాదు అతను చాలా పేదవాడని చెప్పింది. ఇక గతంలో లాస్య.. తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నానని.. 2014లో ఆమె ప్రెగ్నెంట్ కావడం.. దాన్ని ఎవరికీ తెలియకుండా తీయించుకోవడం మొదలగు విషయాల గురించి చెప్పి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మోనాల్ తన చదువు గురించి చెప్పి.. డిగ్రీ చదివే సమయంలో సబ్జెక్ట్ లు పోయాయని పేర్కోంది.
    Published by:Suresh Rachamalla
    First published: