Bigg Boss Telugu 4: ఇవాళ బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతడే

ముందుగా గంగవ్వ సేవ్ అయినట్లు ప్రకటించిన నాగార్జున.. అనంతరం ఇంటి సభ్యులందరికీ షాకిచ్చారు. ఈ వారం ఒక్కరు కాదు.. ఇద్దరు వెళ్లిపోతారు.. డబుల్ ఎలిమినేషన్ అని బాంబు పేల్చారు.

news18-telugu
Updated: September 20, 2020, 1:31 PM IST
Bigg Boss Telugu 4: ఇవాళ బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతడే
బిగ్ బాస్ తెలుగు 4 లోగో (Photo : Twitter)
  • Share this:
Bigg Boss Telugu 4: బిగ్ బాస్ తెలుగు 4 రసవత్తరంగా మారింది. గేమ్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని.. సేఫ్ గేమ్ ఆడుతున్నారని శనివారం హౌస్ మేట్స్‌కు చివాట్లు పెట్టారు నాగార్జున. సేఫ్‌ గేమ్‌కు స్థానం లేకుండా ఓ టాస్క్ ద్వారా ఇంటి సభ్యుల మధ్య చిచ్చుపెట్టారు. ఇంట్లో ఎవరు హీరో, ఎవరు జీరో చెప్పాలని టాస్క్ ఇచ్చారు. ఎక్కువ మంది గంగవ్వ, అమ్మ రాజశేఖర్‌లను హీరో చేయగా.. కుమార్ సాయి, కరాటే కళ్యాణిని జీరో చేశారు. ఇంటిలో అమ్మ రాజశేఖర్ జోకులు శృతి మించుతున్నాయని.. ఓ టాస్క్ విషయంలో దివిని తాకాడని.. యాంకర్ లాస్య కామెంట్ చేయడంతో.. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనను ఇంటి నుంచి ఎలిమినేట్ చేయండి సార్.. వెళ్లిపోతానని మోకాళ్లపై కూర్చొని నాగార్జునను రిక్వెస్ట్ చేశాడు. అమ్మరాజశేఖర్‌ను చూసి మిగతా సభ్యులు కూడా కంటి తడిపెట్టుకున్నారు.

ఈ టాస్క్ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియపై డిస్కషన్ జరిగింది. ముందుగా గంగవ్వ సేవ్ అయినట్లు ప్రకటించిన నాగార్జున.. అనంతరం ఇంటి సభ్యులందరికీ షాకిచ్చారు. ఈ వారం ఒక్కరు కాదు.. ఇద్దరు వెళ్లిపోతారు.. డబుల్ ఎలిమినేషన్ అని బాంబు పేల్చారు. శనివారం ఒకరు, ఆదివారం మరొకరు ఇంటి నుంచి వెళ్లిపోతారని ప్రకటించారు. అనంతరం కరాటే కల్యాణి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడంతో.. మిగతా సభ్యులు ఆమెకు వీడ్కోలు పలుకుతారు. మరి ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

గంగవ్వ సేవ్ కావడం, కరాటే కల్యాణి ఎలిమినేషన్ తర్వాత.. ప్రస్తుతం ఏడుగురు నామినేషన్‌లో ఉన్నారు. వారిలో మోనాల్ గజ్జర్, అమ్మరాజశేఖర్, అభిజీత్, హారిక, నోయెల్, సోహైల్, కుమార్ సాయి ఉన్నారు. వీరిలో ఇవాళ ఎలిమినేట్ అయ్యేది.. కుమార్ సాయి అనే చర్చ సోషల్ మీడియాలో మొదలయింది. ఇంటిలో ఒంటరిగా ఉండడం.. అందరితో కలిసిపోకపోవడం, టాస్క్‌ల్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో... అతడికి తక్కువ ఓట్లు పడ్డాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హీరో-జీరో టాస్క్‌లోనూ చాలా మంది కుమార్ సాయినే జీరో చేశారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే.. ఖచ్చితంగా కుమార్ సాయే ఇంటి నుంచి వెళ్లిపోతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలియాలంటే.. ఇవాళ్టి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Published by: Shiva Kumar Addula
First published: September 20, 2020, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading