news18-telugu
Updated: November 4, 2020, 6:27 PM IST
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో (Image:StarMAA)
Bigg Boss Telugu 4: బిగ్ బాస్ హౌస్‌లో హీట్ పెరిగింది. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా అమ్మ రాజశేఖర్-అభిజీత్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక అఖిల్, సోహైల్ ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లారు. మంగళవారం ఎపిసోడ్లో అంత రచ్చ జరిగింది. నామినేషన్స్ కోసం ఒక్కొక్కరికి రెండు గుడ్లు ఇచ్చిన బిగ్ బాస్.. ఇద్దరి పేర్లు చెప్పి, వాళ్లు ఇంటి నుంచి ఎందుకు వెళ్లాలో చెప్పి..నామినేట్ చేయాలని సూచించాడు. ఈ ప్రక్రియ అనంతరం అభిజీత్, అమ్మ రాజశేఖర్, అవినాష్, మోనాల్, హారిక నామినేషన్లోకి వచ్చారు. మోనాల్‌ను నామినేట్ చేసి అందరికీ షాకిచ్చాడు అఖిల్. ఐతే నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ పొందేందుకు అందరికీ ఒక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్.
నామినేషన్లో ఉన్న సభ్యులు గార్డెన్ ఏరియాలోని స్టాండ్లపై నిల్చుంటే.. మిగిలిన సభ్యులు అక్కడున్న వస్తువులను వారి తలలపై వేసి డిస్టర్బ్ చేయాలి. స్టాండ్ నుంచి తప్పుకునేలా టార్చర్ చేయాలి. వాటిని తట్టుకొని ఎక్కువ సేపు ఎవరు ఉంటే వారు ఇమ్యూనిటీ పొందుతారు. అమ్మరాజశేఖర్ ముక్కులో గడ్డిపోచలు పెట్టి ఇబ్బంది పెడతాడు అఖిల్. ఐతే మాస్టర్‌కు సోహెల్, మెహబూబ్ సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో అఖిల్, సోహెల్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇరువురూ కొట్టుకునేం వరకు వెళ్లారు. అటు మోనాల్, అవినాష్, హారికపై పై మట్టి, ఐస్ వాటర్, గడ్డి పోసి ఇబ్బంది పెడతారు హౌస్మేట్స్. ఐతే ఒకరి కంటే ఎక్కువ మంది స్టాండ్‌పై ఆఖరి వరకు ఉన్నందున.. ఎవరినీ సేవ్ చేయలేదు బిగ్‌బాస్.
ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. హౌస్‌మేట్స్‌కు పల్లెకు పోదాం చలో చలో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో సోహైల్ ఊరిపెద్దగా, లాస్య గ్రామ పెద్ద భార్యగా నటించారు. లాస్యను ఆకట్టుకునేందుకు ప్రయత్నించే క్యారెక్టర్లో అమ్మ రాజశేఖర్ కనిపించాడు. ఇక పాన్ షాప్ నిర్వాహకుడిగా అవినాష్ సందడి చేశాడు. ఐతే సోహైల్ కూతురైన అరియానా... అవినాష్‌తో క్లోజ్‌గా ఉంటూ అతడి కంట్లో పడుతుంది. దాంతో అవినాష్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు సోహైల్. ఈ క్రమంలోనే సోహైల్ కాళ్లు మొక్కుతాడు అనినాష్. మరోసారి ఇలా జరిగితే గ్రామం నుంచి బహిష్కరిస్తానని సోహైల్ వార్నింగ్ ఇచ్చాడు.
ఇక హారికకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అంతేకాదు మెహబూబ్ విలన్‌గా నటించాల్సి ఉందని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ఎపిసోడ్ అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని తలపించనుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. గ్రామంలో ఒక హత్య జరిగిందని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మరి ఎవరు చనిపోయారు? ఎందుకు చంపేశారు? వివరాలు తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.
Published by:
Shiva Kumar Addula
First published:
November 4, 2020, 6:23 PM IST