news18-telugu
Updated: October 25, 2020, 3:52 PM IST
దివి వడ్త్యా Photo : Instagram
Divi Vadthya: దివి వద్త్యా... ఈ బిగ్ బాస్ బ్యూటీ ఈ పేరు నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయినా తర్వాత సూపర్ పాపులర్ అయ్యింది. ఈ బిగ్ బాస్ బ్యూటీ మహర్షితో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. మోడల్‌గా యాక్టర్‌గా రాణించాలనీ కోరుకుంటున్న ఈ బ్యూటీకి బిగ్ బాస్ వేదిక కొంత పాపులారిటీని తెచ్చిందనే చెప్పోచ్చు. అది అలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ నుండి ప్రతి వారం ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాల్సిందే. దీంతో మొదటి వారంలో సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. రెండవ వారం కరాటే కళ్యాణీ ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత మూడవ వారం దేవి నాగవల్లి, నాల్గవ వారం స్వాతీ దీక్షిత్, ఐదవ వారం సుజాత ఎలిమినేట్ అవ్వగా.. గంగవ్వ స్వయంగా ఆరోగ్యం సరిగా లేక బయటకు వచ్చింది. ఆరవ వారం కుమార్ సాయి ఇంటి నుంచి వీడారు. ప్రస్తుతం ఏడవ వారం నడుస్తోంది. ఈ వారం అందాల నటి దివి ఎలిమినేట్ అయ్యినట్లు సమాచారం. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4లో శనివారం ఎపిసోడ్ హోస్ట్ లేకుండానే షో నడిచింది. బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమా ప్రేమ మొదలైంది ప్రీమియర్, అవార్డ్స్, ఇక హౌజ్ మేట్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లతో షో ఆసక్తికరంగా నడిచింది.
మాములుగా అయితే నామినేషన్స్ లో ఉన్న వారిని సేవ్ చేయడం. సండే రోజు ముగ్గురు, నలుగురు నామినేషన్స్ లో వారిని టెన్షన్ లో పెట్టి చివరగా ఒకరిని ఎలిమినేట్ చేయడం లాంటివి చేస్తారు. కానీ హోస్ట్ నాగార్జున తన సినిమా షూటింగ్ కోసం మనాలీ వెళ్లాడు. ఓ ఇరవై రోజుల వరకు రాకపోవచ్చని సమాచారం. దీంతో బిగ్ బాస్ సీజన్ 4లో ఈసారి ఓ గెస్ట్ హోస్ట్ వస్తున్నారు. అది ఎవరో కాదు సమంత. మామ బదులుగా సమంత ఈ ఆదివారం షో హోస్ట్ చేస్తుంది.
ఇక ఈ వారం అభిజిత్, మోనాల్, దివి, అరియానా, నోయెల్, అవినాష్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు సేవ్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూస్తే మాములుగా అందరు మోనాల్ ఎలిమినేట్ అవుతారని అనుకోగా ఈసారి కూడా బిగ్ బాస్ మోనాల్ ను సేవ్ చేసి దివిని ఎలిమినేట్ చేశాడని తెలుస్తుంది. హౌజ్ లో దివి తన ఆట తాను ఆడుతున్నా ఇంకా వెనకపడ్డదని దీనికి కారణం అమ్మా రాజశేఖర్ అని అంటున్నారు. దివి తన పని తాను చేసుకోక వీలున్నప్పుడల్లా అమ్మా రాజశేఖర్ చుట్టూ తిరుగుతూ.. తన ఆటలో పావు అయ్యిందని అంటున్నారు. అమ్మా రాజశేఖర్ మాయలో పడి దివి తన ఆటను మరిచిపోయిందని.. దిని ఎలిమినేట్ అవ్వడానికి అమ్మా రాజశేఖర్ ఓ ముఖ్య కారణమని కామెంట్స్ పెడుతున్నారు. ప్రతిసారి అమ్మా అమ్మా అంటూ రాజశేఖర్ చుట్టూ తిరగడంతో విసుగుచెందిన బీబీ ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేయ్యలేదని.. అందుకే ఆమెకు గుడ్ బై చెబుతున్నారని టాక్.
Published by:
Suresh Rachamalla
First published:
October 25, 2020, 3:52 PM IST