Bigg Boss Telugu 4 : గంగవ్వను బయటకు పంపే ప్లాన్ చేస్తోన్న బిగ్ బాస్ యాజమాన్యం..

Telugu Big Boss Season 4: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

news18-telugu
Updated: September 18, 2020, 11:42 AM IST
Bigg Boss Telugu 4 : గంగవ్వను బయటకు పంపే ప్లాన్ చేస్తోన్న బిగ్ బాస్ యాజమాన్యం..
తన 60 ఏళ్ల జీవితంలో ఏసీ అంటే తెలియదు అలాంటి అన్ని పక్కలా చల్లగాలి వచ్చే ప్రదేశంలో ఆమెను పడేసారు. బంధీగా ఎప్పుడూ లేని గంగవ్వను తీసుకొచ్చి నాలుగు గోడల మధ్య బంధీని చేసారు. దాంతో ఆమె ప్రాణం అక్కడ తట్టుకోలేకపోతుంది. ఇదే విషయాన్ని పాపం బిగ్ బాస్‌కు కూడా చెప్పుకుని కన్నీరు పెట్టుకుంది గంగవ్వ.
  • Share this:
Big Boss Telugu 4 : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్స్‌ను పూర్తిచేసుకున్న ఈ షో నాల్గవ సీజన్‌లో మొదటి వారంను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఎలిమినేషన్‌లో భాగంగా సూర్య కిరణ్ బయటకు వచ్చేశాడు. ప్రస్తుత సీజన్’కు కూడా నాగార్జున అక్కినేని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక ఈసారి బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో అందరికంటే ప్రత్యేకం యూ ట్యూబ్ స్టార్‌ గంగ‌వ్వ. కూలీ నాలీ పని చేసుకునే గంగవ్వ మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్‌లో నటించి సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆమెకున్న క్రేజ్ రిత్యా గంగవ్వను హౌజ్’లోకి పంపిన.. ఊళ్లో పొలం పనులు చేసుకుంటూ.. ఇరుగుపొరుగుతోటి జాలీగా గడిపే గంగవ్వకు హౌజ్ వాతావరణం నచ్చడం లేదట. తన మనస్సంతా తన ఇంటిదగ్గరే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ హౌజ్ నుండి గంగవ్వ బయటకు రావాలనీ కొరుకుంటున్నట్లు ఇంటర్నల్ టాక్. అయితే ఓటింగ్‍ ద్వారా గంగవ్వ ఎలిమినేషన్‍ జరగడం ఇంపాజిబుల్‍. ఎందుకంటే ఆమె అంతా పాపులర్. దీనికి తోడు అవ్వకు సింపతీ ఓట్లు వచ్చేస్తున్నాయి.

గంగవ్వ (Twitter: StarMaa)
గంగవ్వ (Twitter)


కనుక ఆమె రెగ్యులర్‍ పద్ధతిలో బయటకు వచ్చే అవకాశమే లేదు. ఈ సంగతి బిగ్‍బాస్‍ నిర్వాహకులకు కూడా తెలుసు. పల్లెటూర్లో ఆరు బయట తిరుగుతూ, పొలం పనులు చేసుకుంటూ కాలక్షేపం చేసే వృద్ధురాలికి అలా ఒకే ఇంట్లో అపరిచితులతో అన్ని రోజులుండడం జరిగే పని కాదు. దీంతో బిగ్‍బాస్‍ నిర్వాహకులు ఆమెను అయిదు వారాల పాటు వుండాలని చెప్పారట. కానీ మొదటి వారానికే అవ్వకు ఇంటిపై మనసు మళ్లిందట. ఇప్పటికే హౌజ్‌లో ఏదో ఉన్నానంటే ఉన్న అనుకుంటూ ఉంటున్న గంగవ్వ ఇప్పటికే నాగార్జునతో రెండుసార్లు బయటకు పంపుర్రి అంటూ అర్జీ పెట్టుకుంది. అంతేకాదు మొదటి ఎలిమినేషన్ సూర్యకిరణ్‍ వెళ్లిపోతుంటే.. తనను పంపేసి అతడిని వుంచమని కోరింది గంగవ్వ. దీంతో ముందు కుదిరిన అగ్రిమెంట్‍ ప్రకారం అయిదు వారాల పాటు గంగవ్వ అక్కడ వుంటుందా అనేది అనుమానమే అంటున్నారు విశ్లేషకులు. మరో తాజా వార్త ఏమంటే.. గంగవ్వ హౌజ్ నుండి మూడవ వారంలో రానుందని సమాచారం. ఆమె స్వచ్ఛందంగా బయటకు వచ్చే అవకాశముందని వినిపిస్తోంది. మరోవైపు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా గంగవ్వను రెగ్యులర్‍ కంటెస్టెంట్‍గా లెక్కించలేదు. అందుకే మొదటి వారంలోనే వైల్డ్ కార్డ్ అంటూ ఈరోజుల్లో ఫేమ్ సాయిను ఎక్స్ ట్రా ప్లేయర్‍‌గా దించారు. ఇక గంగవ్వ బయటకు వచ్చిన వారంలో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండనుందని సమాచారం అందుతోంది. కరోనా కారణంగానో లేదా మరే ఇతర కారణంగానో ఈ సారి హౌజ్‌లో  ఎక్కువ  కొత్త మొఖాలే. దీంతో ఇంతకుముందున్న క్రేజ్ మాత్రం ఈసారి రావడంలేదని ఫీల్ అవుతున్నారు షో అభిమానులు.
Published by: Suresh Rachamalla
First published: September 16, 2020, 8:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading