Bigg Boss Telugu 4: బిగ్ బాస్ తెలుగు 4 రెండో వారానికి చేరుకుంది. మొదటి వారం తర్వాత ఇంటి నుంచి దర్శకుడు సూర్య కిరణ్ వెళ్లిపోయాడు. హౌస్‌లో అందరిపైనా పెత్తనం చెలాయించాలని చూడడంతో.. ఆయనపై నెగెటివ్ అభిప్రాయం పెంచుకున్న ప్రేక్షకులు.. ఓట్లు తక్కువగా వేసి ఇంటి నుంచి పంపించేశారు. ఆ తర్వాత మరో కొత్త సభ్యుడు ఇంట్లోకి వెళ్లాడు. ఈ రోజుల్లోతో పాటు మరికొన్ని సినిమాల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడికన్ కుమార్ సాయి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. హోస్ట్ నాగార్జున అతడిని సీక్రెట్‌గా ఇంట్లోకి పంపించాడు. ఇంటి సభ్యులెవరికీ ఈ విషయం తెలియదు. మరిన్ని సాయిని హౌస్ మేట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ప్రేక్షకులు చర్చించుకుంటున్న వేళ.. కొత్త ప్రోమో రిలీజ్ చేసి గంగవ్వ అభిమానులకు షాకిచ్చింది స్టార్ మా.
ఇవాళ్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో..రెండోవారం నామినేషన్ ప్రక్రియను చూపించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇంటి లోపలికి ఓ పడవను తీసుకొచ్చారు. సభ్యులంతా అందులో ఎక్కాల్సి ఉంటుంది. ఒకసారి ఎక్కిన తర్వాత మళ్లీ దిగకూడదు. పడవ తీరానికి చేరుకున్నాక హారన్ మోగిన తర్వాత.. ఖచ్చితంగా ఒక్క సభ్యుడు పడవ నుంచి కిందకు దిగాల్సి ఉంటుంది. అందుకోసం మిగతా హౌస్మేట్స్ ఒకరిని కన్విన్స్ చేయాలి. అలా పడవ దిగిన వ్యక్తి.. ఈ వీక్ నామినేషన్స్‌లో ఉంటాడు. ఐతే పడవ దిగేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. గంగవ్వ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రోమోలో కనిపిస్తోంది. ఫస్ట్ నేనే దిపోతా.. అంటూ దిగిపోయే ప్రయత్నం చేస్తుంది. అంతలోనే మిగతా సభ్యులు జోక్యం చేసుకొని వద్దు అని చెబుతారు. మరి గంగవ్వ పడవ నుంచి దిగిపోయి సెల్ఫ్ నామినేట్ చేసుకుంటుందా? లేదా అనేది ఇవాళ్టి ఎపిసోడ్లో తేలనుంది.
Boat journey simple ga undabothunda..enthamandi untaru? enthamandi digutharu? Lets wait and watch!!#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/Er1OPgUAx6
— starmaa (@StarMaa) September 14, 2020
ప్రోమోను చూసిన నెటిజన్లు ఈ వారం నామినేషన్స్‌కు సంబంధించి తమ అభిప్రాయాలను చెబుతున్నారు. నోయెల్ సానుభూతి డ్రామా మొదలెట్టాడని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం అరియానాను దింపేయండి అని ట్వీట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే గంగవ్వను మెచ్చుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 4 Telugu, Gangavva, Telugu Cinema, Tollywood