హోమ్ /వార్తలు /సినిమా /

Monal Gajjar : మోనాల్‌ గజ్జర్‌కు బంపర్ ఆఫర్.. నాగార్జున సినిమాలో అలా కనిపించనుందట..

Monal Gajjar : మోనాల్‌ గజ్జర్‌కు బంపర్ ఆఫర్.. నాగార్జున సినిమాలో అలా కనిపించనుందట..

Monal Gajjar Photo : Instagram

Monal Gajjar Photo : Instagram

Nagarjuna: అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.

Nagarjuna: అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. కాగా ఈ సినిమా అతి త్వరలో ప్రారంభం అవ్వుతుందని తెలుస్తోంది. ఈ సీక్వెల్‌లో నాగార్జున సరసన హిందీ నటి సోనాక్షి సిన్హా నటించనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట.  అయితే ఎప్పుడో ఈ సినిమా గురించి ప్రకటించగా.. ఇన్నాళ్లు స్క్రిప్టులో పలు మార్పులు చేసి ఫైనల్‌గా ఓకే అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాను నాగార్జునఈ నెల 20న పూజా కార్యక్రమాలతో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని సమాచారం. ఈ చిత్రంలో మరో హీరోగా నాగ చైతన్య యాక్ట్ చేస్తున్నారు. నాగ చైతన్య సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తుందని తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుని ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి బరిలో దించాలనీ నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. అయితే సంక్రాంతి బరిలో ఇప్పటికే ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమా ‘రాధే శ్యామ్’ ఉంది. ఇక ఇటీవలే పవన్, రానా మలయాళీ రీమేక్ మూవీ కూడా వస్తున్నట్లు ప్రకటించారు. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కూడా సంక్రాంతి బరిలో వస్తోంది. వీటితో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎఫ్ 3’ కూడా పండుగకు రెడీ అవుతోంది. ఇక ‘సోగ్గాడే చిన్నినాయనా’ విషయానికొస్తే.. సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టింది. అంతేకాదు నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.


ఇక తాజా సమాచారం మేరకు ఈసినిమాలో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ ఓ సాంగ్‌లో మెరవనుందని తెలుస్తోంది.బిగ్‌బాస్ తెలుగు నాల్గవ సీజన్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన గుజరాతీ అందం మోనాల్ గజ్జర్‌ ప్రస్తుతం పలు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో నటిస్తూ అదరగొడుతోంది. ఇక తాజాగా అక్కినేని నాగార్జున హీరోగా, కల్యాన్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' లో స్పెష‌ల్ సాంగ్’లో అందాల విందు చేసిన సంగతి తెలిసిందే. ఇక నాగార్జున బంగార్రాజుతో పాటు మరో కొన్నిసినిమాల్లోను నటిస్తున్నరు. ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ‌లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ స్టైలిష్ యాక్షన్ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో నటుడు నాగార్జున కొత్తగా కనిపించనున్నాడట. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వైడ్ అప్పీల్ తీసుకురావడం కోసం ఇతర భాషలు నుండి నటీనటులను తీసుకుంటోందట చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమాలో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్‌ నటిస్తోంది.


ఇక నాగార్జున నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ అనే ఓ హిందీ సినిమాలోను నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్‌, ఆలియా భట్‌ నటిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

First published:

Tags: Akkineni nagarjuna, Monal gajjar, Tollywood news

ఉత్తమ కథలు