Home /News /movies /

BIGG BOSS TELUGU 4 DIRECTOR ANIL RAVIPUDI SKIPS MAHESH BABU SAILERUNEKEVVERU MOVIE TO WATCH BIGG BOSS SHOW SK

Bigg Boss Telugu 4: మహేష్‌బాబుతో సినిమా షూటింగ్ ఎగ్గొట్టి బిగ్‌బాస్ చూసిన డైరెక్టర్

మహేష్ బాబు (Twitter/Photo)

మహేష్ బాబు (Twitter/Photo)

Bigg Boss Telugu Grand Finale: డైరెక్టర్ అనిల్ రావిపూడి సెట్‌లోకి వెళ్లి ఇంటి సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సీజన్‌తో హౌజ్‌ లోపలికి వెళ్లి.. ఇంటి సభ్యులను కలిసిన తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం.

    Bigg Boss Telugu 4: దాదాపు 100 రోజులకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 4 రియాలిటీ షో నేటితో ముగియనుంది. ప్రస్తుతం గ్రాండ్ ఫినాలే వైభవంగా జరుగుతోంది. ఐతే ఈ బిగ్‌బాస్ షోకు సాధారణ ప్రజలే కాదు.. సినీ సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్‌‌గా మారిపోయారు. రోజంతా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా.. రాత్రి 09.30కు టీవీ ముందు కూర్చొని బిగ్ బాస్ షో చూస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి బయటపెట్టారు. బిగ్‌బాస్‌కు అనిల్ రావిపూడి వికీపీడియాలా మారిపోయాడని.. ఎలాంటి సమాచారం కావాలన్న ఆయన వద్ద దొరుకుతుందని నాగార్జున చెప్పారు.

    అంతేకాదు అనిల్ రావిపూడికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు హోస్ట్ నాగార్జున. కాసేపటి క్రితమే మహేష్ బాబుకు ఫోన్ కాల్ చేశానని.. బిగ్ బాస్ అంటే అనిల్ రావిపూడికి ఎంత ఇష్టమో ఆయన చెప్పినట్లు వెల్లడించారు. సరిలేరు నీకెవ్వరు సినిమా సమయంలో షూటింగ్‌ను మధ్యలో వదిలేసి బిగ్‌బాస్ చూశాడని పేర్కొన్నారు. 10 నిమిషాల తర్వాత వస్తానని మహేష్ బాబుకు చెప్పి వెళ్లిపోయిన అనిల్ రావిపూడి.. రాత్రి 10.30 తర్వాత వచ్చాడని తెలిపారు. అంతసేపు బిగ్ బాస్ షో చూసినట్లు చెప్పారు నాగార్జున.

    కాగా, బిగ్ బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలేకు డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్‌గా వచ్చారు. ఆయనతో పాటు హీరోయిన్లు ప్రణీత సుభాష్, మెహ్రీన్ ఫిర్జాదా బిగ్ బాస్ సెట్లో సందడి చేశారు. ఆటపాటలతో అలరించి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక అనిల్ రావిపూడి సెట్‌లోకి వెళ్లి ఇంటి సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సీజన్‌తో హౌజ్‌ లోపలికి వెళ్లి.. ఇంటి సభ్యులను కలిసిన తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం. కరోనా నేపథ్యంలో ఎవరినీ బిగ్ బాస్ ఇంటి లోపలికి అనుమతించడం లేదు. కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు, రీయూనియన్ సమయంలోనూ.. ఒక ట్రాన్స్‌పెరెంట్ రూమ్ ఏర్పాటు చేసి.. అక్కడి నుంచే మాట్లాడించారు తప్ప.. హౌస్‌మేట్స్‌ను నేరుగా కలవనీయలేదు.

    మరోవైపు ఐదుగురు సభ్యుల్లో ఎవరు టైటిల్ గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఫినాలేకు ఏకంగా 15 కోట్ల 60 లక్షల ఓట్లు పోలయినట్లు హోస్ట్ నాగార్జున చెప్పారు. ఐతే అనధికారిక పోలింగ్‌తో పాటు సోషల్ మీడియాలో వినిపిస్తున్న లీకుల ప్రకారం.. అభిజీత్ టైటిల్ గెలిచినట్లు సమాచారం. ఎవరికీ రానన్ని ఓట్లను ఈ మిస్టర్ కూల్ సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో అఖిల్, సోహెల్, అరియానా, హారిక ఉన్నట్లు తెలుస్తోంది. నిజంగానే అభిజీత్ గెలిచాడో? లేదో? మరికాసేపట్లో తేలనుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Anil Ravipudi, Bigg Boss, Bigg Boss 4 Telugu, Mahesh babu, Tollywood

    తదుపరి వార్తలు