news18-telugu
Updated: November 5, 2020, 3:10 PM IST
సమంత Photo : Twitter
Bigg Boss Telugu 4: ప్రస్తుతం తెలుగు టీవీ ప్రేక్షకులందరిని తమవైపుకు తిప్పుకుని టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న షో బిగ్ బాస్. ఈ సీజన్ మొదట్లో కాస్తా వెనుకబడిన షో.. ఆ తర్వాత రకరకాల టాస్క్’లతో పాటు.. వివాదాలతో మంచి రేటింగ్‌ను దక్కించుకుంటుంది. ఇక బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నా నాగార్జున తన సినిమా వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం ఆ మధ్య మనాలీ వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో బిగ్ బాస్ వారాంతంలో హోస్టింగ్ ఎవరు చేస్తారు అని అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా అక్కినేని సమంత ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. హోస్ట్‌గా మామకు తగ్గ కోడలిగా సమంత అదరగొట్టింది. వచ్చిన తెలుగుతో ఎక్కడా తడబడకుండా సమంత ఆకట్టుకుంది. దసరా స్పెషల్‌గా వచ్చిన సమంత తన యాంకరింగ్‌తో శభాష్ అనిపించుకుంది. అంతేకాకుండా గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ కు మంచి టీఆర్పీనే వస్తుంది అంతా అనుకున్నారు. ఇప్పుడు అలా అనుకున్నట్టుగానే 11.4 గట్టి టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ వచ్చాయి. దీంతో బిగ్ బాస్ యాజమాన్యం తెగ సంబరపడిపోతుందట.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఆ మధ్య శర్వానంద్‌తో కలిసి నటించిన 'జాను' బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థ సమంతతో హర్రర్ థ్రిల్లర్ జోనర్లో ఓ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి తొలుత శరవణ్ అశ్విన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలు ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.
Published by:
Suresh Rachamalla
First published:
November 5, 2020, 3:10 PM IST