Home /News /movies /

BIGG BOSS TELUGU 4 CPI NARAYANA SLAMS BIGG BOSS SHOW AND NAGARJUNA SK

Bigg Boss Telugu 4: బిగ్‌బాస్‌పై నారాయణ షాకింగ్ కామెంట్స్.. నాగార్జునపై ఆగ్రహం

నాగార్జున, నారాయణ

నాగార్జున, నారాయణ

Bigg Boss Telugu 4: కళామతల్లికి అన్యాయం చేస్తూ.. సాంస్కృతిక దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు నారాయణ.

    Bigg Boss Telugu 4: ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్‌బాస్‌పై రచ్చ షురూ అయింది. షో ప్రారంభమైన తర్వాతి రోజు నుంచే విమర్శలు మొదలయ్యాయి. మనదేశ సంస్కృతి సంప్రదాయాలను మంట గలుపుతున్నారని.. శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని.. బిగ్ బాస్ నిర్వాహకులు, హోస్ట్ నాగార్జునపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీపీఐ నారాయణ కూడా బిగ్ బాస్‌ షోపై మండిపడ్డారు. యువతీ యువకులను 100 రోజుల పాటు ఇంట్లో  పెట్టి సమాజానికి ఎలాంటి సందేశమిస్తున్నారని విరుచుకుపడ్డారు. కళామతల్లికి అన్యాయం చేస్తూ.. సాంస్కృతిక దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు నారాయణ.

    బిగ్ బాస్ షో వైభవంగా ప్రారంభమైంది. హిమాలయాల్లో ఉన్న సంస్కృతిని తీసుకొచ్చి మురికి కుంటలో పడిసినట్లుంది. విజయ్ మాల్యా ఎంతటి విలాస జీవితం గడిపారో అంతకు మించిన భవనాలను ఏర్పాటు చేశారు. యువతీ యువకులను 100 రోజుల పాటు లోపల పెడతారట. ఓ యువకుడి ముందు ముగ్గురు హీరోయిన్ల ఫొటోలు ఉంచి నాగార్జున పలు ప్రశ్నలు అడిగాడు. ఒక అమ్మాయిని ముద్దుపెట్టుకుంటా.. ఒకమ్మాయితో డేటింగ్ చేస్తా.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అతడు చెబితే నాగార్జున ఆనందపడ్డాడు. ఇదా మీరిచ్చే సందేశం.  కళామతల్లికి అన్యాయం చేస్తున్నారు. కోట్లాది మందిని టీవీల ముందు కూర్చోబెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. సాంస్కృతిక దోపిడీకి పాల్పడుతున్నారు. దీన్ని ఖండిస్తున్నాం.
    నారాయణ


    కాగా, తెలుగింటి బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలయిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొత్తం 16 మంది సభ్యులు ఇంట్లోకి అడుగుపెట్టగా.. వారిలో 9 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. ప్రస్తుతం హీరోయిన్ మోనాల్ గజ్జర్, యాంకర్ లాస్య, జర్నలిస్టులు దేవినాగవల్లి, సుజాత, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక, దివి, అరియానా గ్లోరీ, నటి కరాటే కళ్యాణి, గంగవ్వ, కొరియోగ్రాఫర్ అమ్మా రాజశేఖర్, ర్యాప్ సింగర్ నోయెల్, దర్శకుడు సూర్య కిరణ్, నటుడు అభిజిత్, సయ్యద్ సోహైల్, అఖిల్ సార్థక్, మెహబూబా దిల్సే బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌గా ఉన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bigg Boss, Bigg Boss 4 Telugu, CPI Narayana, Nagarjuna Akkineni

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు