news18-telugu
Updated: November 28, 2020, 10:27 AM IST
అభిజిత్ (Star Maa/Twitter)
Bigg Boss 4 Telugu Abhijeet | తెలుగు సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో బిగ్‌బాస్ షో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో ఈ వారంతో 12 వారాలు పూర్తి చేసుకోబోతుంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ వారం నలుగురు నామినేట్ అయ్యారు. అందులో ముగ్గుర్ని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చి నామినేట్ చేసాడు. మరొకరు మాత్రం సెల్ఫ్ నామినేట్ అయ్యారు. ఈ సారి నామినేషన్స్ గ్రీన్, రెడ్ కలర్ హ్యాట్స్ ఆధారంగా జరిగాయి. అందులో భాగంగానే సోహైల్, మోనాల్ గ్రీన్ హ్యాట్ వచ్చిన కారణంగా సేవ్ అయ్యారు. హారిక కెప్టెన్ కాబట్టి నామినేట్ కాలేదు. అవినాష్, అరియానా, అఖిల్, అభిజీత్ రెడ్ హ్యాట్ వచ్చినందుకు నామినేట్ అయ్యారు. కానీ అందులో మళ్లీ ఒకరికి త్యాగం చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో అభిజీత్ కోసం తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది మోనాల్ గజ్జర్. అలా ఈ వారం నలుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు.
బిగ్‌బాస్ 4 తెలుగులో విజేతగా నిలవడానికి ఓట్లు కీలకం. అందు కోసం ప్రత్యేకంగా ఓ పీర్ టీమ్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది. అందులో ఎవరు ఓట్ల గురించి ఎలాంటి చర్చ రాలేదు. అంతేకాదు ఎన్టీఆర్ కూడా బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరిపై మొగ్గు చూపలేదు.
ఆ తర్వాత రెండో సీజన్లో కౌశల్ మందా, మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విజేతలుగా నిలిచారు. అందులో కౌశల్ కోసం స్పెషల్‌గా ఓ పీర్ టీమ్ ఏర్పడి.. కౌశల్ ఆర్మీ అంటూ అతనికి భారీగా ఓట్లు పోలైయ్యేటట్లు చేసారు. కానీ నాల్గో సీజన్‌కు మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో జెన్యూన్‌గా ఆడటం లేదనే విమర్శ ఉంది. దీంతో బిగ్‌బాస్ హౌస్ కంటెస్టెంట్స్ పై ఎవరికీ అంతగా సదభిప్రాయం లేదనే మాటలు వినిపిస్తున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను బట్టి.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అభిజిత్.. తనకు ఎక్కువ ఓట్లు పోలవ్వడానికి ఎలిమినేషన్ నుంచి బయటపడటానికి పీఆర్ టీమ్ పెట్టుకున్నట్టు సమాచారం. అభిజిత్ హౌస్‌లో బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులను మంచి ఆడతున్నాడా అంటే అది లేదు. కానీ ప్రతి వారం ఎలిమినేషన్ నుంచి బయటపడుతున్నాడు. దీంతో అభిజిత్.. హౌస్‌లో సేవ్ కావడానికి బయట పెద్ద పీఆర్ టీమ్‌నే పెట్టుకున్న వార్తలకు బలం చేకూరింది. అభిజిత్ విషయానికొస్తే.. అతను ఎంతో హంబుల్‌గా జెన్యూన్ అని ప్రేక్షకుల్లో ఉంది. అలాంటి అభిజిత్ ఓట్ల కోసం పీఆర్ టీమ్ పెట్టుకొని విజేతగా నిలిచే చీప్ పనులు చేస్తాడా అనేది ఆయన అభిమానులు అంటున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 28, 2020, 10:27 AM IST