Home /News /movies /

BIGG BOSS TELUGU 4 BIG BOSS SHOCKING COMMENTS ON ABIJEETH SK

Bigg Boss Telugu 4: అభిజీత్‌పై బిగ్‌బాస్ షాకింగ్ కామెంట్స్.. రిప్లై అదుర్స్

అభిజీత్ (Image:Twitter)

అభిజీత్ (Image:Twitter)

Bigg Boss Telugu 4: ఇప్పటి వరకు అఖిల్, అభిజీత్ జర్నీని మాత్రమే చూపించారు. ఇవాళ సోహెల్, హారిక, అరియానా జర్నీని ప్రదర్శించబోతున్నారు. మరోవైపు టాప్-5లో ఉన్న వీరి కోసం.. అభిమానులు ఓట్ల వేట మొదలుపెట్టారు. తమ ఫేవరేట్ కంటెస్టెంట్‌ను గెలిపించేందుకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Bigg Boss Telugu 4: బిగ్ బాస్ తెలుగు 4 రియాలిటి షో ఆఖరి అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రస్తుతం ఉన్న హౌస్‌లో ఉన్న టాప్-5 కంటెస్టెంట్‌లకు బిగ్ బాస్ జర్నీ చూపించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. హౌస్‌లో ఎంటరయింది మొదలు.. ఫైనల్‌కు వెళ్లే వరకు సాగిన ప్రయాణ క్రమాన్ని స్క్రీన్‌పై ప్రదర్శించారు. తమ జర్నీని స్క్రీన్‌పై చూసుకొని అఖిల్, అభిజీత్ మురిసిపోయారు. ఐతే అభిజీత్ ఏవీ సందర్భంగా బిగ్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు.

    హౌస్‌లోకి యంగ్ చార్మింగ్ బాయ్‌లా వచ్చిన మీరు.. ఎన్నో ప్రశంసలు అందుకుంటూ మెచ్యూర్డ్ మ్యాన్ ఇన్ ది హౌస్ అనే టైటిల్ సాధించారు. ఈ చిన్న ప్రయాణంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్ని మరెన్నో బంధాలను ఏర్పరచుకున్నారు. కష్టాలను దాచుకుని బాధపడ్డారు. మీరు మీకంటే ఎక్కువగా వేరే వాళ్ల గురించి ఆలోచించారు. ఇంటి సభ్యులకు మర్యాద ఇచ్చారు.. తిరిగి తీసుకున్నారు. నీలాంటి పరపక్వత కలిగిన తెలివైన కంటెస్టెంట్ హౌస్‌లో ఉన్నందుకు బిగ్ బాస్ చాలా గర్వపడుతున్నారు' అని కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఓ ఇంటి సభ్యుడిపై ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించడం ఇదే తొలిసారి.

    బిగ్‌బాస్ ఆ మాట అన్న వెంటనే అభిజీత్ ఉబ్బితబ్బిపోకుండా.. మరోసారి మెచ్యూర్డ్ మ్యాన్‌లా ప్రవర్తించాడు. ''అయ్యో బిగ్ బాస్.. ఈ ఇంటికి వచ్చినందుకు నేను గర్వపడుతున్నా.'' అని పేర్కొన్నాడు. బిగ్ బాస్‌కు వచ్చి సరైన నిర్ణయమే తీసుకున్నానని చెప్పాడు. ఇక అభిపై బిగ్ బాస్ ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అభిజీతే విన్నర్ అవుతాడనడానికి ఇదే నిదర్శనమని సోషల్ మీడియాలో పోస్టుల మోత మోగిస్తున్నారు.

    ఇప్పటి వరకు అఖిల్, అభిజీత్ జర్నీని మాత్రమే చూపించారు. ఇవాళ సోహెల్, హారిక, అరియానా జర్నీని ప్రదర్శించబోతున్నారు. మరోవైపు టాప్-5లో ఉన్న వీరి కోసం.. అభిమానులు ఓట్ల వేట మొదలుపెట్టారు. తమ ఫేవరేట్ కంటెస్టెంట్‌ను గెలిపించేందుకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అభి టాప్‌లో ఉన్నాడని సమాచారం. మరి విన్నర్ ఎవరో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయకతప్పదు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bigg Boss, Bigg Boss 4 Telugu, Telugu Movie, Tollywood

    తదుపరి వార్తలు