news18-telugu
Updated: October 28, 2020, 8:04 AM IST
బిగ్ బాస్ హౌజ్‌లో అరియాన, సోహైల్, అఖిల్ Photo : Star maa
బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రస్తుతం 8వ వారం నడుస్తోంది. ఈ వారం నామినేషన్లో ఆరుగురు ఉన్నారు. కాగా ఆరుగురిలో చాలామంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు ఉన్నా రు. ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లు పేర్లు గమనిస్తే అఖిల్, మోనాల్, అరియానా, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, లాస్య ఉన్నారు. ఇక ప్రతి వారం నామినేట్ అయ్యే అభిజీత్ ఈసారి మాత్రం నామినేషన్లో లేకపోవడం విశేషం. సోహెల్ కూడా ఈ వారం నామినేట్ కాలేదు. అరియానా, అఖిల్, లాస్య బలంగా ఉన్నారు. దీంతో వీరు బయటకు వెళ్లే అవకాశం తక్కువ. మిగతా ముగ్గురు నీ గమనిస్తే అమ్మ రాజశేఖర్, మోనాల్, మెహబూబ్. ఈ ముగ్గురికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఉన్నట్లు సమాచారం. దీంతో రాబోయే వారం లో ఈ ముగ్గురిలో ఒకరు గ్యారెంటీ అవుట్ అనే డిస్కషన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతున్నాయి. ఈ ముగ్గురిలో అమ్మా రాజశేఖర్ ఈ వారం ఎలిమినేట్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు నెటిజన్స్. ఇక అది అలా ఉంటే.. నిన్న జరిగిన ఎపిసోడ్లో పిల్లలు.. కేర్ టేకర్స్ అదరగొట్టారు ఇంటి సభ్యులు. బిగ్‌బాస్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలాగుంటుంది అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు హౌస్మేట్స్. చెప్పాలంటే కేర్ టేకర్లకు నరకం చూపించారు. వీరిలో ముఖ్యంగా సోహైల్‌ను ఆడేసుకుంది అరియానా. సోహైల్ కేర్ టేకర్’గా ఉంటే.. ఆరియానా చిన్నపిల్లగా నటించింది. దీంతో తనను నామినేట్ చేసిన సోహైల్‌కు అరియానా పట్టపగలే చుక్కలు చూపించింది. అతనిపై ఎక్కి కూర్చుంది. జుట్టూ పీకుతూ సోహైల్‌ను ఓ లెవల్లో ఆటాడుకుంది.
మరో ఇంటి సభ్యుడు మెహబూబ్ బేబీగా మారగా.. అఖిల్ అతని కేర్ టేకర్‌గా చేశాడు. వీళ్ల జోడి కూడా బాగానే ఆకట్టుకుంది. ఈ టాస్క్‌లో అఖిల్ కేర్ టేకర్‌గా మెహబూబ్‌ను పదేపదే ఎత్తుకుని తిప్పాడు. అరియానా సోహైల్ మీద ఎక్కి చల్‌చల్ గుర్రం ఆడుకుంది. ఇక మరోవైపు సోహైల్ తనను నాన్న అని పిలవద్దని ఎంత చెప్పిన సరే.. అరియానా అతడిని పదేపదే నాన్న అని పిలుస్తూ అమ్మ ఎక్కడ? అంటూ ముద్దుగా ముద్దుగా అడిగింది. ఆ తర్వాత ఆమెను సోహైల్ భుజాలపై ఎత్తుకుని బిగ్ బాస్ వరండా అంతా తిప్పాడు. ఇక అరియానా మాత్రం వీలున్నప్పుడల్లా ముఖానికి రంగు పూస్తూ తలపై నారింజ పొట్టు వేసి, పౌడర్ కొట్టి, పిలక వేసి నానా రకాలుగా సోహైల్‌తో ఆటాడుకుంది. అవినాష్, అమ్మా రాజశేఖర్, హారిక కూడా చిన్న పిల్లలుగా బాగానే అలరించారు.
Published by:
Suresh Rachamalla
First published:
October 28, 2020, 8:02 AM IST