Bigg Boss Telugu 4 : బిగ్ బాస్ హోస్ట్‌గా అనుష్క.. షాక్‌లో అభిమానులు...

Bigg Boss Telugu 4 : ఈ షో గురించి ఓ ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది. ప్రస్తుత సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న నాగార్జునకు బదులుగా మరో హోస్ట్ రానున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 27, 2020, 3:06 PM IST
Bigg Boss Telugu 4 : బిగ్ బాస్ హోస్ట్‌గా అనుష్క.. షాక్‌లో అభిమానులు...
బిగ్ బాస్ తెలుగు 4 లోగో (Photo : Twitter)
  • Share this:
బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో ఇప్పటి వరకు మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం నాల్గవ సీజన్ నడుస్తోంది. పోయిన సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేయ్యగా.. అంతకు ముందు నాని, ఎన్టీఆర్‌లు తమ యాంకరింగ్‌తో సందడి చేశారు. ఇక ఈ సీజన్ ఈ సారి కొంత లేటైనా ఇప్పుడే అసలైన ఎంటర్ టైన్మెంట్ మొదలైంది.  అందులో భాగంగా షో ప్రారంభ‌మైన వారం రోజులకే బిగ్‌బాస్ నిర్వాహ‌కులు వైల్డ్ కార్డ్ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు. అందులో భాగంగా మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా “ఈరోజుల్లో” బస్టాప్ ఫేమ్ సాయి కుమార్ హౌజ్’లోకి వచ్చాడు. ఆ తర్వాత మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ పేమ్ ముక్కు అవినాష్ వచ్చాడు. మూడో వారం కూడా మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే మొదటి రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మగవారు కాగా.. ఈ సారి స్వాతి దీక్షిత్ అనే హీరోయిన్‌ను దించారు. ఇక మొదటి వారంలో కొంత నీరసంగా సాగిన షో రెండు మూడో వారంలోకి వచ్చేసరికి పూర్తి వినోదాత్మకంగా, కొంత వివాదంగా మారుతోంది.

అది అలా ఉంటే.. ఈ షో గురించి ఓ ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది. ప్రస్తుత సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న నాగార్జునకు బదులుగా మరో హోస్ట్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకీ నాగార్జున బదులుగా వచ్చే స్టార్ హీరోయిన్ ఎవరు అంటే అనుష్క అని సమాచారం. అనుష్కకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 4లో ఒకరోజు హోస్ట్ గా అనుష్క రాబోతుందని తెలుస్తుంది. అనుష్క నటించిన నిశ్శబ్ధం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్‌లో భాగంగా అనుష్క బిగ్ బాస్ హోస్ట్‌గా రానుంది. డిజిటల్ ప్రీమియర్ గా వచ్చే అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి వస్తుండటంతో అనుష్క సినిమా ప్రమోషన్‌ను ఇలా సెట్ చేసిందట. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించాడు. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడడంతో విడుదల ఆగిపోయింది. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అయ్యేపనికాదన్న విషయం తేలిపోవడంతో, ఇన్నాళ్లూ ఆగిన నిర్మాత ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌కు అమ్మాడు. ఈ సినిమాను అమోజాన్ ప్రైమ్ దాదాపు 25 కోట్లుపెట్టి స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందని సమాచారం అందుతోంది. మొత్తం మూడు భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. తెలుగు తమిళ, మళయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో అనుష్క సరసన మాధవన్ మేల్ లీడ్ లో నటించగా అంజలి, షాలిని పాండేలు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు.

సో అక్టోబర్ 2న ఓటీటీలో విడుదల కానున్న నేపథ్యంలో బిగ్ బాస్ వేదికనే ప్రమోషనల్ ఈవెంట్ కు వేదికగా మార్చుకోవాలని చూస్తోన్న అనుష్క. బిగ్ బాస్ వేదికపైకి రానుందట. ఇందుకు సంబంధించిన షూటింగ్ జరిగి పోయిందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అందులో భాగంగా నేటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జునతో పాటు అనుష్క స్టేజ్ ని పంచుకోనుందని సమాచారం. బిగ్ బాస్ కు అనుష్క రెండో మహిళా సెలబ్రిటీ హోస్ట్‌గా నిలుస్తారని.. అంతేకాదు నాగ్ నుంచి ఆమె బాధ్యతలను స్వీకరిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ కు తొలి మహిళా వ్యాఖ్యాతగా రమ్యకృష్ణ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే అనుష్క ఈ ఒక్క ఎపిసోడ్‌కు మాత్రమే హోస్ట్‌గా చేయనుందా.. లేదా తదుపరి కొన్ని వారాల పాటు ఆమెనే హోస్ట్ గా వ్యవహరించనుందా అనేది తెలియాల్సిఉంది.
Published by: Suresh Rachamalla
First published: September 27, 2020, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading