Bigg Boss Telugu 4 : లాస్యపై అమ్మా రాజశేఖర్ భార్య రాధ సీరియస్ కామెంట్స్..

Bigg Boss Telugu 4 : బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ లాస్య‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది అమ్మా రాజశేఖర్ భార్య రాధ.

news18-telugu
Updated: October 23, 2020, 12:01 PM IST
Bigg Boss Telugu 4 : లాస్యపై అమ్మా రాజశేఖర్ భార్య రాధ సీరియస్ కామెంట్స్..
లాస్య, అమ్మా రాజశేఖర్ భార్య రాధ Photo : YouTube
  • Share this:
Lasya : తెలుగు యాంకర్‌లలో లాస్యది ప్రత్యేకమైన స్థానం. చీమ ఏనుగు జోక్స్‌తో సమ్ థింగ్ స్పెషల్ అంటూ క్యూట్ యాంకర్‌గా పేరుతెచ్చుకుంది. అనసూయ, రష్మీ, శ్రీముఖి.. లాంటివాళ్లతో పోటీని తట్టుకంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొంది లాస్య. చురుకైన యాటిట్యూడ్ ఆకట్టుకొనే.. లాస్య కొన్నాళ్లుగా బుల్లితెరపై కనిపించడం లేదు. తాజాగా బిగ్ బాస్ షో నాల్గవ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. అందులో ఓ కంటెస్టెంట్’గా పాల్గొన్న లాస్య ఓ సందర్భంలో మరో ఇంటి సభ్యుడు డైరెక్టర్ కమ్ డ్యాన్స్ మాస్టర్‌ అమ్మా రాజశేఖర్‌‌పై హౌజ్‌లో తన ప్రవర్తనపై కొన్ని కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో లాస్య చేసిన కామెంట్స్‌పై అమ్మా రాజశేఖర్ భార్య స్పందించింది. ఈ షో లో కంటెస్టెంట్స్ కుటుంబీకులను బయట పలు వెబ్ మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్ భార్య రాధ ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె షాకింగ్ కామెంట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. బిగ్ బాస్ షో మొదలైన రెండో వారంలో.. ఓ టాస్క్‌లో భాగంగా 14వ ఎపిసోడ్‌లో హీరో-జీరో అనే టాస్క్ జరిగింది. ఈ టాస్క్’లో తమకు హౌస్‌లో ఇష్టం లేని వ్యక్తి గురించి చెప్పి వాళ్లని ద్వారం గుండా మెడపెట్టి బయటకు తోసివేయ్యాలి. దీంతో ఆ టాస్క్‌లోనే టీవీ 9 యాంకర్ దేవి రాజశేఖర్‌ మాస్టర్‌పై మండిపడింది. నవ్వుతూ.. వెకిలి కామెడీ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ అయితే ఎవరికి గొప్ప అంటూ విరుచుకు పడింది. ఆ టాస్క్‌లో అమ్మ రాజశేఖర్ కి వ్యతిరేకంగా యాంకర్ లాస్య, టీవీ9 రిపోర్టర్ దేవి నాగవల్లి వ్యతిరేకంగా ఓటు వేసారు.  ఆయన కామెడీ చేస్తున్నారు కాని.. ఓవర్ కామెడీ చేస్తున్నారు లిమిట్ ఉంటే బాగుంటుంది అంటూ లాస్య రాజశేఖర్‌పై మండిపడింది.

ఇక తాజాగా ఆ ఆరోపణలపై ఇటీవల అమ్మ రాజశేఖర్ భార్య రాధా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. వారు అలా తన భర్తపై అలా మాట్లాడడం చూసి ఆ ఇద్దరిపై అసహనం కలిగిందని రాధా తెలిపింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘వృత్తి పరంగా నా భర్త రాజశేఖర్ వందల మంది అమ్మాయిలతో పనిచేశారు.. ప్రొఫెషనల్ పరంగా ఆయన్ని ఒక టాస్క్‌లో సంచాలకుడిగా పెట్టారు. కానీ యాంకర్ లాస్య చాలా రిజర్వ్డ్ టైప్ అనుకుంటా.. అనవసరంగా నా భర్తపై నింద వేసేసింది.. అందుకే తట్టుకోలేకపోయారు ఆయన. అందుకే అంతలా ఏడ్చేశారు. నింద వేసేటప్పుడు అది కరెక్ట్ అయ్యి ఉండాలి.. చేయని తప్పుని చేశారంటే ఆయన తట్టుకోలేరు.. నా భర్త చేయని పని చేశారంటూ నింద వేసింది లాస్య.. అంటూ చెప్పుకొచ్చింది రాధ.
Published by: Suresh Rachamalla
First published: October 23, 2020, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading