Bigg Boss Telugu 4 : హౌజ్‌లో అమ్మా అరాచకం.. హారికకు చక్కులు చూపిస్తోన్న మాస్టర్..

Bigg Boss Telugu 4 : నిన్నటి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా 'రింగులో రంగు' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌.

news18-telugu
Updated: November 7, 2020, 11:15 AM IST
Bigg Boss Telugu 4 : హౌజ్‌లో అమ్మా అరాచకం.. హారికకు చక్కులు చూపిస్తోన్న మాస్టర్..
హౌజ్‌లో అమ్మా, హారిక Photo : Star Maa
  • Share this:
అBigg Boss Telugu 4 : బిగ్ బాస్ తొమ్మిదవారం నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా 'రింగులో రంగు' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ కెప్టెన్సీ టాస్క్‌లో హారిక, అరియానా, అమ్మ రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ టాస్కులో మాస్టర్ హారిక మీద పడి ఆమె టీషర్ట్‌ను రంగుతో నింపాడు. అరియానా మీద కూడా రంగు పడింది. ఇక తనపై రంగు పడకుండా తప్పించుకున్న అమ్మ రాజశేఖర్ ఈ వారం కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయ్యాడో లేదో.. ఇక తన ప్రతాపాన్ని చూపడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా తన టీమ్ అయినా అవినాష్‌ని రేషన్ మేనేజర్‌గా, అరియానాను తన అసిస్టెంటుగా నియమించుకున్నాడు. అయితే మామూలుగానే మాస్టర్‌ను ఆపడం కష్టం.. ఇక ఇంటి కెప్టెన్ అవ్వడంతో తన లోని ఫ్రస్టేషన్ అంతా బయటకు తీస్తున్నాడు. ఆయన కెప్టెన్‌ అవ్వడంతో ఆయనకు పడని అభిజిత్‌, అఖిల్‌, హారికలకు చుక్కులు చూపిస్తున్నాడు. అందులో భాగంగా పనులను పంచే విషయంలో పక్షపాతం చూపించాడు. తనకు అనుకూలంగా ఉండే అవినాష్‌, మోహబూబ్‌ లకు చిన్న పనులు ఇచ్చాడు. ఇక అరియానాకు అసలు ఏం పని లేకుండా తన అసిస్టెంట్‌గా ఉండమన్నాడు. ఇక హారికకు వంట పనితో పాటు క్లీనింగ్‌ పని కూడా ఇచ్చాడు. దీంతో హారిక వ్యతిరేకించింది. తాను ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులు చేయని స్పష్టం చేసింది. మరోవైపు కొందరు ఇంటిసభ్యులు అమ్మ రాజశేఖర్‌ ఇచ్చిన పనుల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు.

 Bigg Boss Telugu 4, bigg boss news, amma rajashekar, harika, amma becomes captain, bigg boss telugu news, bigg boss telugu updates, bigg boss sohel, avinash on sohel, Bigg Boss Telugu, అవినాష్, సోహెల్, బిగ్ బాస్ తెలుగు 4
అమ్మా, అవినాష్, అరియానా Photo : Star Maa


అది అలా ఉంటే గత కొన్ని రోజులుగా అమ్మ రాజశేఖర్‌ తీరుపై అటు ఇంటి సభ్యులు.. ఇటు బయట ప్రేక్షకులు అసహనంతో ఉన్నారు. నెటిజన్స్ అమ్మ రాజశేఖర్‌ వెళ్లి పోవాలని బలంగా కోరుకుంటున్నట్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు. ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్స్‌ లో ఎక్కువ శాతం మంది ఆయన్ను ఇంట్లో ఉండనిచ్చేది లేదు అంటూ పేర్కోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కెప్టెన్ అయినా కూడా అమ్మా ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే ఈ వారం ఆయనకు కెప్టెన్ ఇమ్యూనిటీ రాదని ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు.
Published by: Suresh Rachamalla
First published: November 7, 2020, 11:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading