Bigg Boss 4 Telugu: అభిజీత్‌తో వాగ్వాదం...సోహైల్‌కు వాష్ రూమ్‌లో కౌన్సెలింగ్!

Bigg Boss 4 Telugu- Sohail vs Abhijeet: మూడో వారంలో రోబోలు-మనుషుల టాస్క్‌లో ఎదురైన ఓటమి పరాభవం మనుషుల టీం సభ్యులను ఇంకా వెన్నాడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ టాస్క్‌లో రోబోల టీమ్‌ను విజేతగా నిలిపిన అభిజిత్‌కు మనుషుల టీమ్‌లో సభ్యుడైన సోహైల్‌కు మధ్య మంగళవారం హౌస్‌లో వాగ్వివాదం చోటుచేసుకుంది.

news18-telugu
Updated: September 30, 2020, 1:28 PM IST
Bigg Boss 4 Telugu: అభిజీత్‌తో వాగ్వాదం...సోహైల్‌కు వాష్ రూమ్‌లో కౌన్సెలింగ్!
బిగ్ బాస్ హౌస్‌లో అభిజీత్-సోహైల్ మధ్య వాగ్వివాదం(Photo: Star Maa)
  • Share this:
ఐపీఎల్‌కు పోటీగా నిలుస్తూ తెలుగు ప్రేక్షకులను టీవీలకు కట్టపడేస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్(Bigg Boss 4 Telugu) నాలుగో వారం రసవత్తరంగా సాగుతోంది. మూడో వారంలో రోబోలు-మనుషుల టాస్క్‌లో ఓటమి పరాభవం మనుషుల టీం సభ్యులను ఇంకా వెన్నాడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ టాస్క్‌లో రోబోల టీమ్‌ను విజేతగా నిలిపిన అభిజిత్‌కు మనుషుల టీమ్‌లో సభ్యుడైన సోహైల్‌కు మధ్య మంగళవారం హౌస్‌లో వాగ్వివాదం చోటుచేసుకుంది. దివిని కిడ్నీప్ చేసి బ్యాటరీ ఛార్జింగ్ చేసుకున్న అభిజిత్‌పై..లేడీస్‌ను అడ్డంపెట్టుకుని గెలిచావంటూ సోహైల్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అటు మనుషుల టీం‌లో సభ్యుడైన మెహబూబ్ కూడా తనకు తానుగా కల్పించుకుని సొహైల్‌కు బాసటగా నిలిచాడు. అయితే అభిజిత్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన వాదనను బలంగా వినిపించాడు. చర్చ ఆరోగ్యకరమైనదే అయినా...ఈ సందర్భంగా సోహైల్ కాస్త అగ్రెసివ్‌గా కనిపించాడు. ఒకానొక సందర్భంగా ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఎక్కడ పరిస్థితి అదుపు తప్పుతుందేమోనని ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. మిగిలిన సభ్యులు రావడంతో సోహైల్ కాస్త కోపాన్ని తగ్గించుకుని...అభిజిత్‌‌కు ఫిజికల్ టాస్క్‌లు ఇవ్వకండి..పాపం అతను అవి చేయలేడని బిగ్ బాస్‌కు సూచిస్తూ సోహైల్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు సోహైల్.

అభిజిత్ -సోహైల్ మధ్య వాగ్వివాదం జరుగుతున్నంత సేపు పక్కనే ఉన్న మనుషుల టీమ్‌లో మరో సభ్యుడైన నోయల్ మాత్రం తనకు ఏమీ తెలియదన్నట్లు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత కూడా షోలో సోహైల్ అగ్రెసివ్‌గానే కనిపించాడు. కాయిన్స్ దొంగతనానికి సంబంధించి అరియానా గ్లోరీ, సుజాతాతోనూ వాగ్వివాదానికి దిగాడు. నాలుగో వారంలో నామినేషన్‌లో నిలుస్తున్న సోహైల్...కాస్త ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలనుకున్నాడో ఏమో..హౌస్‌లో యాంగ్రీ యంగ్‌మెన్ రోల్ ప్లే చేశాడు.

సోహైల్(Photo: Star Maa)


సోహైల్‌లో కాస్త ఎక్కువగా దూకుడుగా కనిపించడంతో హౌస్‌లోని సభ్యులు కూడా ఇదే చర్చించుకున్నారు. సోహైల్ అలా మాట్లాడడం సరికాదంటూ అవినాష్‌తో అరియానా చెబుతూ కనిపించింది. దీంతో కొందరు మనుషుల టీమ్‌లోని సభ్యులు అఖిల్,మోనాన్, మెహబూబ్‌లు...సోహైల్‌‌ను వాష్ రూమ్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హౌస్‌లో డిస్కషన్ చేస్తే కెమరాల్లో రికార్డయ్యే అవకాశం ఉన్నందున..సోహైల్‌ను వాష్‌ రూమ్‌కు తీసుకెళ్లి మాట్లాడారు. ముగిసిన టాస్క్ గురించి చర్చించుకోవడంతో ప్రయోజనం ఉండదని, అవేశపడకుండా, కూల్‌గా తదుపరి టాస్క్‌లను ఆడటంపైన దృష్టిపెట్టాలని సోహైల్‌కు సూచించినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అభిజిత్‌తో హౌస్‌లో మాటల యుద్ధాన్ని కొనసాగించవద్దని సోహైల్‌కు అఖిల్ సూచించినట్లు సమాచారం.

అటు హౌస్‌లో అభి-సొహైల్‌కు మధ్య నడిచిన వాగ్వివాదానికి సంబంధించి సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఎవరు కరెక్ట్ అన్న విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే సోహైల్ తన వాదనను సమర్థించుకోవడంలో తప్పుకాదుకానీ...కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నట్లు కనిపించాడని కొందరు కామెంట్స్ చేశారు. నామినేషన్‌లో ఉండటంతో కెమరా కళ్లను ఎక్కువ సమయం తనపై నిలుపుకుని...ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే తాపత్రయంతో సోహైల్ ఇలా ప్రవర్తిస్తున్నాడన్న అభిప్రాయాన్ని కూడా కొందరు నెటిజన్స్ వ్యక్తంచేస్తున్నారు.
Published by: Janardhan V
First published: September 30, 2020, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading